Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్ కార్మికుల వేతనాల చెల్లింపు ప్రైవెట్ ఎజెన్సీలకు అప్పజెప్పద్దు

మున్సిపల్ కార్మికుల వేతనాల చెల్లింపు ప్రైవెట్ ఎజెన్సీలకు అప్పజెప్పద్దు

0

మున్సిపల్ కార్మికుల వేతనాల చెల్లింపు ప్రైవెట్ ఎజెన్సీలకు అప్పజెప్పద్దు

మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు
కమిషనర్ కు వినతిపత్రం

న్యూస్ తెలుగు/చింతూరు: మున్సిపల్ ఉద్యోగ, కార్మికుల వేతనాల చెల్లింపు,పనుల అప్పగింత నిర్వహణ సాంఘిక భద్రత మున్సిపల్ శాఖకే పూర్తి బాధ్యతలు ఉండాలిని ప్రైవేట్ కంపెనీ/ఏజన్సీలకు అప్పజెప్పొద్దుని తూర్పుగోదావరి జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మధు అధ్యక్షులు సంగిరెడ్డి రమణ మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులకు గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ లో ఎన్కాష్మెంట్, మూడు డీఏలు సత్వరం విడుదల చేయాలని కోరారు. ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపుకై గత సమ్మెలో నాటి ప్రభుత్వంతో అంగీకారమైన అగ్రిమెంట్ మేరకు వేతనాలు పెంచివ్వాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన కార్మికులను పెంచాలని
ఇంజనీరింగ్ ఒప్పంద సిబ్బందికి సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి ని డిమాండ్ చేశారు. గత 15 సంవత్సరాలుగా స్కూల్ స్వీపర్లకు వేతనాలు పెంచలేదని సత్వరం వీరి వేతనాలు పెంచాలిని కోరారు. ఏడాదికాలంగా పెండింగ్లో ఉన్న మరణించిన రిటైర్మెంట్ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు పనులు కల్పించాలి.
రెగ్యులర్ ఉద్యోగ, కార్మికుల వలె ఔట్ సోర్సింగ్ ఉద్యోగ,కార్మికుల రిటర్డ్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలిని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు ఎస్ రమణ దానాల దుర్గమ్మ, వెంకటేశ్వరావు పోలమ్మ , మురళి, వెంకట గిరి, అల్లం బాలు వీరబాబు, కిరణ్ కుమార్ శ్రామిక మహిళ పోరం నాయకురాలు పి లావణ్య తదితరులు పాల్గొన్నారు. (Story: మున్సిపల్ కార్మికుల వేతనాల చెల్లింపు ప్రైవెట్ ఎజెన్సీలకు అప్పజెప్పద్దు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version