ఇంటర్ హాల్ టిక్కెట్లు వచ్చేశాయ్!
న్యూస్ తెలుగు/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టిక్కెట్లను ఇంటర్మీడియట్ విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. అవి మార్చి 19వ తేదీతో పూర్తవుతాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయి. ఈ వార్షిక పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. విద్యార్థులు హాల్ టిక్కెట్ల కోసం ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నంబరుకు ఫోన్‌లో హాయ్ (హి) అనే వాట్సప్‌లో మెసేజ్ చేయాలి.ఆ తర్వాత వివరాలను నమోదు చేసి..హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకునేలా బోర్డు వెసులుబాటు కల్పించింది. మార్చి 1, 3వ తేదీల నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షల హాల్‌టికెట్లను వాట్సప్ గవర్నెన్స్‌లో అందించేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇంటర్మీడియట్ బోర్డు అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి సైతం వీటిని డౌన్‌లోడ్ చేసుకునేలా అవకాశం కల్పించారు. ఇటీవల ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను సైతం వాట్సప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొనేలా బోర్డు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు.. పరీక్షకు హాజరుకానున్నారు. ఫీజులు చెల్లించ లేదంటూ విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలల యాజమాన్య హాల్ టికెట్లు జారీ చేయకుండా, నిలిపేయడం, విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తేయడం తదితర సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో వాట్సప్‌లోనే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేలా నిర్ణయం తీసుకుంది. వాట్సప్ నంబరు 9552300009 ద్వారా ఇంటర్ హాల్‌టికెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్లపై ఎక్కడా ప్రిన్సిపాల్ సంతకం లేకుండా నేరుగా పరీక్షలకు హాజరుకావచ్చు. (Story: ఇంటర్ హాల్ టిక్కెట్లు వచ్చేశాయ్!)