రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ సమస్యను పరిష్కరించండి
సిపిఎం, సిఐటియు నాయకులు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని గాంధీనగర్ రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి దగ్గర వాటర్ నిలవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు పట్టించుకోకపోవడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి మారుతి మాట్లాడుతూ గాంధీ నగర్ రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కింద వాటర్ నిలిచిపోయి, మురిగిపోయిన వాటర్ లో వాసన వస్తున్న ప్రజలకు వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో అదే దారిలో ప్రయాణించడం జరుగుతుంది
అని తెలిపారు. దుర్వాసన కి చాలామంది వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని,అయినాకూడా వేరే దారి లేక ఆ దారి వైపే కొత్తపేట. రామ్ నగర్. రైల్వే స్టేషన్ తారకరామాపురం. గుట్టకింద పల్లి. అదే రోడ్డు గుండానే అనంతపురం కూడా పోవడానికి మెయిన్ రోడ్ ఉన్నందున సమస్యను అధికారులు ఎవరూ కూడా పరిష్కరించడం లేదని తెలిపారు.కాబట్టి ఇప్పుడైనా అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ధర్మవరం పట్టణ రైల్వే అండర్ గ్రౌండ్ రోడ్డు లలో నీటి నిలువ లేకుండా చూడవలసిన బాధ్యత ఉంది అని తెలిపారు. అందుకు సంబంధించినటువంటి ప్రభుత్వాధికారులదే ఇప్పటికైనా పట్టణంలోని ప్రధానమైనటువంటి రైల్వే అండర్ బ్రిడ్జి లు మీద దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇటీవలే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ మున్సిపల్ అధికారి ఆర్ఓ రాజేశ్వరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్హెచ్ భాష ,జేవీ రమణ., అయూబ్ ఖాన్.,ఎస్ఎఫ్ఐ నాగార్జున,హరి,వెంకట స్వామి,లాజర్ ,వాహనదారులు తదితరులు పాల్గొన్నారు