కందుల జయలక్ష్మి కేసులో కదలికలు..?
న్యూస్ తెలుగు /చాట్రాయి : చనుబండ లో షుమారు నాలుగు నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కందుల జయలక్ష్మి కేసులో కదలికలు మొదలయ్యాయి. చాట్రాయి మండలం చనుబండ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కందుల కృష్ణ కూతురు జయలక్ష్మి ఏప్రిల్ ఆరవ తేదీన మరణించగా తన కూతురిని హత్య చేశారని గుర్తించలేకపోయారు. రెండు మూడు రోజుల తరువాత కొన్ని విషయాలు వెలుగులోకి రావడం హత్య చేసిన వ్యక్తిని గ్రామంలోని ఒక కోళ్లదొడ్డిలో దాచేరని ఒక బృందం ప్రణాళిక బద్ధంగా హత్య జరిగిన విషయాన్ని తారుమారు చేశారని అనుమానం రావడంతో గ్రామంలో ఒక వ్యక్తి కొంతమంది సహకారంతో నాకూతురిని హత్య చేశాడని ఫోన్ నెంబర్ల ఆధారంగా విచారణ జరిపించాలని చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పట్లో పోలీసులు పట్టించుకోకపోవడంతో ఏపీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారులకు ఇంటెలిజెన్స్ అధికారులకు జిల్లా పోలీసు ఎస్ పి . తదితరులకు ఆయన ఫిర్యాదు చేశారు. కాలం గడుస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో జిల్లా మంత్రి పార్థసారథి, హోం శాఖ మంత్రి అనిత జిల్లా ఎస్పీలను కలిసి కందుల కృష్ణ తన గోడు వెల్లబుచుకోవడంతో ఈరోజు అనగా మంగళవారం చాట్రాయి పోలీసులు విచారణ ప్రారంభించారని కందులు కృష్ణ తెలిపారు.(Story : కందుల జయలక్ష్మి కేసులో కదలికలు..?)