సమాజ భద్రత కోసం పనిచేసి అమరులైన పోలీస్ త్యాగాలను మరవలేనివి
ధర్మవరం టూ టౌన్ సిఐ రెడ్డప్ప
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : దేశ సమాజ భద్రత శ్రేయస్సు కోసం పనిచేసే అమరులైన పోలీస్ త్యాగాలను మరువలేనివని టూటౌన్ సిఐ రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ అమర వీరుల స్మారక ఉత్సవాలు కార్యక్రమాలలో భాగంగా మూడవ రోజు ధర్మవరం పట్టణంలోని కొత్తపేటలో గల ఎస్పీసీఎస్ మున్సిపల్ ప్రభుత్వ పాఠశాలలో అమర వీరుడు బిల్లే గణేష్ సంస్మరణ సంతాప సభ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వి.రత్న ఐపీఎస్ ఆదేశాలతో నిర్వహించారు.ధర్మవరం మండలంలోని గుట్ట కింద పల్లి గ్రామానికి చెందిన అలివేలమ్మ లేట్ శ్రీనివాసులు కుమారుడైన బిల్లే గణేష్ 2013 సంవత్సరంలో ఏపీఎస్పి కానిస్టేబుల్ గా మంగళగిరిలో ట్రైనింగ్ పొందారు. అనంతరం అన్నమయ్య జిల్లా సుండుపల్లి సమీపంలోని విధులు నిర్వహిస్తూ ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుకునే నేపథ్యంలో వారి దాడిలో మరణించారు అని తెలిపారు. బిల్లే గణేష్ చిత్రపటాన్ని ఉంచి, పూలమాలవేసి, సంస్మరణ సంతాప సభను ద్వారా శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమానికి అమరులైన బి ల్లే గణేష్ భార్య అనూష, వారి తల్లి అలివేలమ్మ లు విచ్చేశారు. వారిచేత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ రక్షణ భద్రత కోసం ఎంతోమంది పోలీసులు అమరులయ్యారని వారి త్యాగాలను మనమందరం ఈరోజు స్మరించుకుంటూ మన ప్రాంతానికి చెందిన అమర కానిస్టేబుల్ బిల్లే గణేష్ కూడా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారని, వారిని ఈ సంతాప సభ ద్వారా స్మరించుకుంటు నివాళులర్పించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల యొక్క త్యాగాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి, 14వ బెటాలియన్ సీఐ. ప్రదీప్ కుమార్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్, నాగేంద్ర, బిల్లే గణేష్ వారి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు,పలువురు ప్రముఖులు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి భరోసా కల్పిస్తూ ఏటువంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని పోలీస్ శాఖ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని తెలిపారు. (Story : సమాజ భద్రత కోసం పనిచేసి అమరులైన పోలీస్ త్యాగాలను మరవలేనివి)