UA-35385725-1 UA-35385725-1

నియోజకవర్గంలో 70 దరఖాస్తులు తాసిల్దార్ సురేష్ బాబు

నియోజకవర్గంలో 70 దరఖాస్తులు తాసిల్దార్ సురేష్ బాబు

న్యూస్ తెలుగు/ధర్మవరం(శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం రూరల్, అర్బన్, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో ఓటర్ నమోదు కార్యక్రమంలో 70 దరఖాస్తులు రావడం జరిగిందని ధర్మవరం ఎమ్మార్వో (ఎఫ్ఎసి) సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్డిఓ మహేష్ ఆదేశాల మేరకు రెండవ రోజు ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇందులో రెండవ రోజున నియోజకవర్గంలో ఫారం -6 లో 43, ఫారం-7 లో 11, ఫారం-8 లో 16 వెరసి 70 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. ఈ ప్రత్యేక నమోదు కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిందని తెలిపారు. తదుపరి ఎమ్మార్వో సురేష్ బాబు వివిధ పోలింగ్ నమోదు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి తగిన సూచనలను తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈడిటి ఈశ్వరయ్య, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.(Story:నియోజకవర్గంలో 70 దరఖాస్తులు తాసిల్దార్ సురేష్ బాబు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1