ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేస్తాం
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్
న్యూస్‌తెలుగు/వినుకొండ : పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం వినుకొండ నియోజకవర్గం వచ్చిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్. వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తి పాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ఉందని, రిజర్వేషన్లు ఎత్తివేసే ఆలోచనలో వచ్చిన తీర్పు మాత్రమేనని వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్రంలో మెజారిటీగా వున్న మాలలు ఐక్యతతో వర్గీకరణకు మద్దతు తెలిపే ఏ రాజకీయ పార్టీలకైనా రానున్న స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అన్ని రంగాల్లో ఉన్న మాలలను ఏకం చేసే విధంగా మాల మహానాడు కమిటీ బలంగా గ్రామ స్థాయిలోకి వెళ్లి పనిచేయాలని నూతన కమిటీని నియమించడం జరిగింది. దీనిలో భాగంగా నియోజకవర్గ గౌరవాధ్యక్షులుగా పమిడిపల్లి ఇశ్రాయేలు ను, కొన్ని చేర్పులు మార్పుల్లో భాగంగా నియోజకవర్గ కార్యదర్శిగా దార్ల ఎర్రయ్యను, నియోజకవర్గ గౌరవ సలహాదారుడుగా కొమ్మ తోటి కృపయ్యను నియమిస్తున్నట్టు అన్ని మండలాలలో కూడా ఉన్న కమిటీలు బలోపేతం చేసేదిశగా వీరు పని చేయాలని నియామక పత్రాలు అందజేయడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా ఎంపికైన పమిడిపల్లి ఇశ్రాయేలు మాట్లాడుతూ. నన్ను నమ్మి ఈ బాధ్యత అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షులు కి, జాతీయ అధ్యక్షులు కి, ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి గ్రామంలో మాలలను ఈ పోరాటంలోకి భాగస్వాములు చేయడానికి అహర్నిశలు కష్టపడతానని తెలిపారు. సమావేశ అనంతరం బొల్లాపల్లి నాయకులు బొందలపాటి రాజేష్, కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ ని ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కోండ్రు విజయ్, నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ కొట్టే వెంకటరావు పట్టణ అధ్యక్షుడు బేతం దేవానంద్ రాయన చిన్న, కొమ్మతోటి సుధాకర్, ఈపూరు మండల అధ్యక్షుడు పెనుమాల వెంకట్రావు, వినకొండ మండల ప్రధాన కార్యదర్శి పిడతల రాజా, పల్లపాటి భాస్కర్,జొన్నలగడ్డ సామేలు, అంబడిపూడి శీను, తదితరులు పాల్గొన్నారు . (Story : ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేస్తాం )