ప్రతిపేద కుటుంబానికి ప్రమాద బీమా రక్షణ ఉండాలి
శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫొటో, వీడియో జర్నలిస్టులకు ప్రమాద బీమా
ఫొటో, వీడియో జర్నలిస్టులకు ప్రమాద బీమా పత్రాలు అందజేసిన జీవీ, మక్కెన
న్యూస్‌తెలుగు/వినుకొండ : సమాజంలో ప్రతిపేద కుటుంబానికి తప్పనిసరిగా బీమా రక్షణ ఉండాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఇంట్లో యజమాని చనిపోతే బిడ్డల చదువులకు గతంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన చంద్రన్న బీమా అందించిన ప్రయోజనాలే అందుకు నిదర్శనమన్నారు. ఆ విషయంపై చాలామంది లబ్దిదారులే తనతో చెప్పారన్నారు. వినుకొండ నియోజకవర్గం పరిధిలోని ఫొటో, వీడియో జర్నలిస్టులకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బుధవారం తన సొంత నిధులతో బీమా కల్పించారు. మొత్తం 175 మందికి బీమా చేయించారు. ప్రమాద మరణాలకు బీమా వర్తించేలా ప్రీమియం చెల్లించారు. వారందరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తించనుంది. వినుకొండ నియోజకవర్గం ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు ఈ మేరకు శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీమా సౌకర్యం కల్పించి దాతృత్వం చాటుకున్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన వారందరికి బీమా పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగానే అంతర్జాతీయ స్థాయిలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కోలిక్ సొసైటీ(అమెరికా) వారి అత్యుత్తమ ఎఫ్‌ఐసీఎస్ అవార్డు పొందిన వినుకొండ ఫొటోగ్రాఫర్ కేశానపల్లి సుబ్బారావును ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే జీవీ మాట్లాడుతూ. కోటీశ్వర్లుకు బీమాతో పనిలేదని, కానీ ప్రతీ పేద కుటుంబానికి రక్షణ ఉండాలనేది తన ఆలోచనగా తెలిపారు. ఫొటో, వీడియో జర్నలిస్టులు రాత్రింబవళ్లు నిద్రహారాలు లేకుండా పని చేస్తారని, సమయం తో సంబంధం లేకుండా ప్రయాణాలు చేస్తుంటారన్నారు. తాను కూడా ఉద్యోగం చేసే సమయంలో బైక్‌పైన తిరిగేవాడినని, డ్రైవింగ్‌లో నిద్ర వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. ఈ కష్టసుఖాలన్ని తనకు తెలుసు కాబట్టి ఫొటో, వీడియో జర్నలిస్టులంతా ప్రమాద బీమా చేయించుకోవాలని, భవిష్యత్తులో వారి కుటుంబాలకు రక్షణగా ఉంటుందన్నారు. వీలైనంత వరకు కనీసం రూ.10 లక్షల పైన ఉండే బీమా చేయించుకోవాలని సూచించారు. ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు తప్పక స్థలం కేటాయిస్తామని, త్వరగా ప్రభుత్వ స్థలాలు గుర్తించి కేటాయింపు చేస్తామన్నారు. వినుకొండలో 4 వేల టిడ్కో ఇళ్లు మంజూరు చేయిస్తే వైకాపా ప్రభుత్వంలో కట్టకుండా గాలికొదిలేయడంతో రద్దు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవి పూర్తయితే ఎంతోమందికి అపార్ట్‌మెంట్ తరహా నివాసాలు సమకూ రేవన్నారు. కొన్నింటికి తన హయాంలోనే 80% నిర్మాణ పనులు పూర్తి చేశామని, ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ఐదేళ్ల పాలనలో పెండింగ్‌లో ఉన్న 20% పనుల చేయలేకపోయారని వాపోయారు. భవిష్యత్తులో కొంతమందికైనా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది తన కోరికన్నారు. పట్టణ గృహనిర్మాణం పథకం కింద కొత్తగా అపార్ట్‌మెంట్లు వస్తే తప్పకుండా నిర్మించి ఇస్తామని, ఇప్పటికే స్థలాలు కూడా సిద్ధం చేసి పెట్టామన్నారు. ఇళ్లు లేనివారందరికి ఇళ్లు ఇవ్వాలనేదే తన సంకల్పమని, భగవంతుడి ఆశీస్సులతో తప్పనిసరిగా అది నెరవేరాలని కోరుకుంటున్నానని తెలిపారు. అసోసియేషన్ సభ్యుల్లో ఎవరికైనా స్థలాలు ఉంటే ప్రభుత్వం తరఫున ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం తరఫున రూ.4 లక్షలు సాయం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రెటరీ శ్రీకాంత్, శ్యామ్, సూర్య, బ్రహ్మం ,సి.పి , కృష్ణ ప్రసాద్ (కె. పి), కాసిం తులసి రెడ్డి, మోహన్,వెంకట్రావు, చిన్న మల్లయ్య, సుధాకర్ రషీద్, మల్లికార్జున,అంజి గుర్నధరావు , చాంద్, సాగర్, నాగరాజు, శ్రీనివాసరావు, అన్వర్, తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రతిపేద కుటుంబానికి ప్రమాద బీమా రక్షణ ఉండాలి)