బి ఎల్ ఎఫ్ ఆధ్వర్యంలో జరిగే లక్ష మంది బహుజన బహిరంగ సభను జయప్రదం చేయండి
వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు, బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ రాయబండి పాండురంగ చారి పిలుపు
కుల జనగణన సమగ్రంగా జరిపి స్థానిక ఎన్నికల ముందే42% అమలు చేయాలి
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ డిమాండ్
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ రాష్ట్ర జనాభాలో దాదాపు 65% ఉన్న 139 బిసి కులాలను మూడు స్రవంతులుగా వర్గీకరించి, సమగ్రంగా ఘనించాలని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్, రాయ బండి పాండురంగ చార్యులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ టిడిపి, కేంద్రంలో కాంగ్రెస్ బిజెపితో బీసీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు విసుగు చెందారని, దేశంలో స్వాతంత్ర పోరాటం, రాష్ట్రంలో తెలంగాణ సాయుధ పోరటం,తెలంగాణ సాధన పోరాటా లు జరిగాయని, ఇప్పుడు జరిగేది బహుజన పోరాటం ద్వారా బీసీ ముఖ్యమంత్రి ప్రధానమైన యజెండని పిలిపిచ్చారు. అదిలాబాద్ జిల్లా వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా కమిటి సమావేశానికి హాజరైన ఆయన వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు పాండురంగ చారి, బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కోశాధికారి మారోజు సునీల్ కుమార్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ దుర్గే ల తో కలిసి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కుల జనగణన లో బిసి కులాల జనాభా లెక్కలను సమగ్రంగా జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జిల్లా మండలం గ్రామ పంచాయతీ వార్డు స్థాయిలో బిసి కులాల జనాభా లెక్కలను సమగ్రంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.కాస్త అభివృద్ధి చెందిన బిసిల కులాలకు చెందిన జాబితా వృత్తి కులాలకు చెందిన జనాభా జాబితా సంచార జాతులకు చెందిన జాబితా పైన పేర్కొన్న మూడు స్రవంతులుగా వర్గీకరించి గణించాలని తెలిపారు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేయబోయే కుల జనగణన లక్ష్యం నెరవేరభోదన్నారు. తెలంగాణలో కుల జనగణన ద్వారా 93% ఉన్న బిసి ఎస్సీ ఎస్టీ మత మైనారిటీలు అగ్రకుల పేదలైన బహుజనలకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బిసి కులాలకు 70 మందికి ప్రాతినిధ్యం కల్పించినప్నుడే నిజమైన బహుజన రాజ్యాధికారానికి అర్థమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెకెనేవర్ అంజయ్య కుమార్, తలారి రంగన్న,బండారు గంగన్న,ఇరుమాళ్ళ రవి, పడమటి అరవింద్,ఎన్ దినేష్ కుమార్, కే సంజీవ్ కుమార్, జాదవ్ రమేష్, సిగ్గుల రాజేశ్వర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : బి ఎల్ ఎఫ్ ఆధ్వర్యంలో జరిగే లక్ష మంది బహుజన బహిరంగ సభను జయప్రదం చేయండి)