UA-35385725-1 UA-35385725-1

100 రోజుల‌ పాలనలో ఒరిగింది ఏంటి..?

100 రోజుల‌ పాలనలో ఒరిగింది ఏంటి..?

చాట్రాయి మండలంలో సాధించింది ఏంటి..?

రెడ్డి గారికి సారది గారికి వారధి ఎవరు..?

న్యూస్ తెలుగు/ చాట్రాయి : ప్రభుత్వం మారితే పరిపాలన వ్యవస్థ మారుతుందని పెత్తందారి విధానం పోతుందని కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టే విధానం మారుతుందని ఎంతగానో ఆశపడిన ప్రజల ఆశలు అడియాశలు అయ్యాయా అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. నూజివీడు నియోజకవర్గం లోని చాట్రాయి మండలంలో ఈనాటికి వైసిపి ప్రముఖ నేత ఏపీ స్టేట్ కోపరేటివ్ యూనియన్ మాజీ చైర్మన్ దేశి రెడ్డి రాఘవరెడ్డి నిర్మించుకున్న పరిపాలన వ్యవస్థ సామ్రాజ్యం 100% నడుస్తుందని పలువురు అంటున్నారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మండలంలో చనుబండ గ్రామంలో చెత్త సంపద తయారీ కేంద్రంలో గత చంద్రబాబు పాలనా కాలంలో పనులు చేయడానికి పెట్టిన కార్మికులు ఎస్సి సామాజిక తరగతికి చెందిన 6మందిని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ,పంచాయతీ కార్యదర్శి వైసిపి పెత్తందారుల మెప్పుకోసం వారికి వచ్చిన 36నెలలు జీతాలను పేర్లు మార్చి వేరే వారి ఖాతాలో వేశారని ఆ రోజుల్లోనే సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే జనసేన సిపిఐ పార్టీలు మద్దతుగా నిలిచాయి.14 లక్షల రూపాయల కూలి డబ్బులను ఇవ్వాలని సాక్షాత్ జిల్లా కలెక్టర్ ఆదేశించినప్పటికీ జిల్లా పంచాయతీ అధికారి అప్పట్లో క్షేత్రస్తాయి పరిశీలన చేసి వాత్సవాలను వెలుగులోకి తెచ్చినప్పటికీ అనాటి వైసిపి పెత్తందారులు కార్యదర్శికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. కూలీలకు డబ్బులు మాత్రం ఎర్రనయా పైసా కూడా ఈరోజుకీ ఇచ్చింది లేదు. ఆరోజు మండలంలో 18 గ్రామ పంచాయతీలకు సగం పైగా పంచాయతీలకు కార్యదర్శి అదే కార్యదర్శి , చాట్రాయి మండలంలో సుమారు 17 సంవత్సరాల నుంచి గ్రామాల పేర్లు మార్చుకుంటూ చాట్రాయి మండలంలోనే బదిలీలు చూపిస్తూ రికార్డులు మార్చడం ఆనవాయితీ గా సాగించుకున్నారని పలువురు అంటున్నారు . వైసిపి పాలనలో బురు గూడెం గ్రామంలో రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన సానుభూతిపరులపై కార్యదర్శి చాట్రాయి పోలీస్ స్టేషన్లో అనేక సందర్భాల్లో కేసులు పెట్టినవి అనేకం. అటువంటి వ్యక్తికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి సాక్షాత్తు మంత్రి సారధితోనే పదోన్నతి లేఖలు ఇప్పించి కైకలూరులో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నా ,నిబంధనలకు విరుద్ధంగా చాట్రాయి మండలం నుంచి బదిలీ చేయకుండా చనుబండలో పోస్టింగ్ ఇప్పించారని సామాజిక మాధ్యమాల్లో ఇటీవల కోడై కూసింది. పేపర్లలో ఎవరు ఏమి రాసుకున్న సామాజిక మాధ్యమాల్లో ఎవరిని పోస్టులు పెట్టిన నాకు ఏ విధమైన ఇబ్బంది లేదని స్వయంగా మంత్రి సారథి తనకు లేఖ ఇచ్చారని జిల్లా పంచాయతీ అధికారి మద్దతు ఇచ్చారని తనను ఎవరు ఏమి చేయలేరని సదరు కార్యదర్శి బహిరంగంగా వాదించడం గమనార్హం. చీపురుగూడెం పంచాయతీ కార్యదర్శి గా మూడు నెలల క్రితం ఒక ఉద్యోగి బాధ్యతలు తీసుకున్న ఈరోజుకి కూడా ఆమెకు కనీసం రిజిస్టర్ ఇచ్చిన దాఖలాలు లేవు. ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. సంవత్సరాల తరబడి చాట్రాయి మండలాన్ని ఏలుతున్న కార్యదర్శి ఇటీవల సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు మామూలు ముట్టజెప్పి మండల పరిషత్ కార్యాలయం పై తన హవా కొనసాగించుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అటువంటి వారికి మంత్రి సారధి మద్దతుగా నిలబడడాన్ని ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి.తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కొత్తలో మండలంలోని పది పంచాయతీలపై అంటే సీనియర్ కార్యదర్శి ఏలుబడిలో ఉన్నవాటి పై విచారణ ప్రారంభించారు. అప్పట్లో ఆదివారం రోజు బూరు గూడెం గ్రామంలోని వైసిపి ప్రముఖ నేత రాఘవరెడ్డి నివాసానికి సోషల్ ఆడిట్ అధికారి కారు వస్తే టిడిపి సోషల్ మీడియా విభాగం మాధ్యమాల్లో కారు ఫోటోని పెద్ద ఎత్తున చెక్కర్లు కొట్టించారు. కొద్ది రోజులు గడిచిన తర్వాత 10 పంచాయితీలపై విచారణ అడ్రస్ లేదు. పంచాయతీ రికార్డులు ఏ ఒక్కటి కూడా సక్రమంగా లేని పరిస్తితి . అప్పట్లో అందరూ అనుకున్నది ఖచ్చితంగా కార్యదర్శి సస్పెండ్ అవుతారని. కానీ జరిగింది ఏంటంటే అదే కార్యదర్శి కి పదోన్నతి ఇచ్చారు. దేశి రెడ్డి రాఘవరెడ్డికి గుండెకాయలా పని చేసిన వ్యక్తిని చాట్రాయి మండలంలో పదోన్నతి ఇప్పించడంతో తెలుగుదేశం పాలనలో కూడా దేశిరెడ్డి తన హవాను మరోసారి చూపించుకున్నారని పలువురు అంటున్నారు. మండల పరిషత్ కార్యాలయ పని విధానంలో కూడా వైసిపి పాలనలో టిడిపి నాయకులకు అనుకూలంగా వైసిపి కి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ముద్ర పడి ఆనాటి ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు ఆగ్రహించి ఇన్చార్జి ఎంపిడిఓ బాధ్యతల నుండి తొలగించిన ఒక ఉద్యోగిని ఇటివల సస్పెండ్ చేయడం కూడా దీనిలో భాగమే అని పలువురు అంటున్నారు. సారధికి వైసిపి నేత దేశి రెడ్డికి వారధిగా పనిచేస్తున్న వారే మొత్తం చక్రం తిప్పుతున్నారని పలువురు అంటున్నారు. ఇటీవల చాట్రాయి మండల టిడిపి నాయకులు మొత్తం తమ అసంతృప్తిని ఆవేదనను వ్యక్తం చేయడానికి మంత్రి సారధి దగ్గరికి వెళ్లినప్పటికీ మంత్రి సారథి క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలను గుర్తించకుండా తనపైనే తిరుగుబాటు చేయడానికి వచ్చారా….? అంటూ బెదిరింపు దోరణి లో మాట్లాడారని బహిరంగంగానే చర్చించుకున్నారు. మంత్రి సారథి గెలిచిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ వచ్చింది చాట్రాయి మండలం చీపురుగూడెం అక్కడ చూసింది వాటర్ ట్యాంకు నిచ్చేన లేకపోవడం. ఈనాటికీ వాళ్ళు నిచ్చెన పెట్టిన దాఖలాలే లేవు. అధికారులను ప్రశ్నిస్తే వర్క్ ఆర్డర్ శాంక్షన్ అంటూ చెబుతున్నారు తప్ప చేసింది శూన్యం. ఇక రెవెన్యూ శాఖలో చూస్తే ఒక వ్యక్తి ఉన్నతాధికారికి మంత్రి పేరు అడ్డం పెట్టుకుని రాత్రి 11 గంటలు దాటిన తరువా ఫోన్లు చేసి వేధించే పరిస్థితి దాపురించిందని ఆ అధికారి పలువురు టిడిపి నేతలు వద్ద ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.కొంత మంది ఆక్రమించిన అడవి భూములకు పట్టాలు ఇవ్వమని పాత రికార్డులు కాల్చి కొత్త రికార్డులు తయారు చేయమని వేధింపులు చేశారని వినవచ్చాయి. ఇక చీపురుగూడెం గ్రామంలో బీసీ యాదవ సామాజిక తరగతికి చెందిన మానికల కేశవరావుకు చెందిన పింఛను నిలిపివేయించారు . గత తెలుగుదేశం ప్రభుత్వం అతనికి సిఎం సహయ నిధులు కూడా ఇచ్చింది .చాట్రాయి మండలంలో తొలిసారిగా కక్ష సాధింపుతో నిలిపివేసిన పింఛన్ పథకంగా గుర్తించబడింది. అదే గ్రామంలో అగ్రకుల భూస్వామి మాజీ సర్పంచ్ బొట్టు సూర్యనారాయణకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేళతాళాలతో తొలిపించను ఇప్పించడం గమనార్హం. పౌర సన్మానం కూడా సారధి ఆయనకే చేయడం విడ్డూరంగా ఉందని గుసగుసలు వినవచ్చాయి. అదే సందర్భంలో పోతనపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వయోవృద్ధురాలు మందలపు జయమ్మ ను పట్టించుకోక పోవడం అగ్రకులంలో కూడా డబ్బు లేని వారిని పట్టించుకోరు అనడానికి అద్దం పట్టిందని పలువురు అంటున్నారు. మండల స్థాయిలో గ్రామాల నుండి ప్రత్యేకమైన ప్రజా సమస్యలను గుర్తించిన దాఖలాలు లేవు. వైసీపీ పాలనలో చనుబండ , ఇతర గ్రామాలలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పనిచేసిన ఒక మధ్య దళారి ఎస్సీ బీసీ సామాజిక తరగతులకు చెందిన రైతుల వద్ద లక్షలాది రూపాయల విలువైన ధాన్యాన్ని మొక్కజొన్నలను కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఎగ కొడితే సిపిఐ అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేసి తొమ్మిది లక్షల రూపాయలు ఇప్పించగా ఇంకా 18 లక్షల రూపాయలు రావాల్సి ఉన్నప్పటికీ వాటి గురించి ఈరోజుకి తెలుగుదేశం పార్టీ పట్టించుకున్న దాఖలాలే లేవు. చాట్రాయి మండల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ పనిచేయక ఏళ్లు గడుస్తున్న ఈనాటికి పట్టించుకున్న దాఖలాలు లేవు. పశు వైద్య శాఖలో అనుభవిధ్యమైన డాక్టర్ పోస్టులు ఖాళీ అయి 40,50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి ఇన్ చార్జ్ లుగా రికార్డులను నమోదు చేస్తే పట్టించుకున్న దిక్కులేదు. ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య బూరుగగూడెం అభివృద్ధి పనులు వివరాలు సమాచార శాఖలో సేకరించుకుని బహిరంగ పరిస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి స్థానిక ఎమ్మెల్యే మంత్రి గా పంచాయితీలు విచారణను ఎందుకు బయట పెట్టలేదు అనేది అనేక అనుమానాలకు తావిస్తుందని పలువురు అంటున్నారు. వంద రోజులు పాలనలో చాట్రాయి మండలానికి ఒరిగింది ఏంటని పలువురు అంటున్నారు. టిడిపి గెలిచిన తర్వాత చాట్రాయి మండలంలో రెండుసార్లు సర్వసభ్య సమావేశాలు జరిగాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మంత్రి ఏమి ఆదేశిస్తారో అని వైసీపీ నేతలు వణికిపోతే టిడిపి పాలన వారిలో మంచి ధైర్యాన్ని నింపిందని పలువురు అంటున్నారు. (Story : 100 రోజుల‌ పాలనలో ఒరిగింది ఏంటి..?)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1