ముదిరాజ్ కమ్యూనిటీ హాలు ప్రారంబోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : ఘనపూర్ మండలము మామిడిమాడ గ్రామములో ముదిరాజ్ కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తుల కోసం కె.సి.ఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చెరువులను మరమ్మతు, చేపపిల్లల పంపిణీ,కులవృత్తి కోసం అవసరమైన ఆధునిక పనిముట్లు ఇచ్చి ప్రోత్సహించింది అని ప్రత్యేక ఫిషరీస్ కళాశాల ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ద్వారా నిపుణులను తయారు చేయడం జరిగింది అని అన్నారు. గత ప్రభుత్వ హయాములో ముదిరాజు కమ్యూనిటీ భవన నిర్మాణ కోసం 4.50లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో ఇంకా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పండుగ.సాయన్న విగ్రహానికి నిరంజన్ రెడ్డి నివాళులు. ఇటీవల షాపూర్ గ్రామములో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న విగ్రహాన్ని సందర్శించి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్,మాజీ జడ్పీటీసీ సామ్య నాయక్,రాళ్ళ.కృష్ణయ్య,బాలాంజనేయులు గౌడ్,మన్నెం గౌడ్, లక్షమయ్య,కృష్ణయ్య,మహేష్ తదితరులు పాల్గొన్నారు.(Story:ముదిరాజ్ కమ్యూనిటీ హాలు ప్రారంబోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి)