UA-35385725-1 UA-35385725-1

దోచుకో పంచుకో తినుకో

దోచుకో పంచుకో తినుకో

ఇది డీపీటీ, స్కామ్‌లు, మాఫియాల ప్రభుత్వం

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.
కూటమి 5 నెలల పాలనలో అంతటా అదే 
సూపర్‌ సిక్స్‌ లేదు. సూపర్‌ సెవెన్‌ లేనే లేదు
ఇచ్చిన హామీలపై  ప్రజలు నిలదీస్తారన్న భయం
అందుకే ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌తో గడిపేస్తున్నారు
ఇసుక, మద్యంలో దోపిడి. విచ్చలవిడిగా పేకాట క్లబ్స్‌
గుర్తు చేసిన  వైయస్‌ జగన్‌
అబద్దాన్ని సృష్టిస్తారు. దానికి రెక్కలు కడతారు
ఎల్లో మీడియాలో అదేపనిగా ప్రచారం చేస్తారు
ప్రజలను నమ్మించేలా అన్ని ప్రయత్నాలు చేస్తారు
ఎన్నికల ముందు అదే తంతు. ఆ తర్వాతా అదే
అదే చంద్రబాబు అనైతిక మోడస్‌ ఆపరెండీ
పేరుకే ఉచిత ఇసుక. ధర గతం కంటే ఎక్కువ
స్టాక్‌ యార్డుల నుంచి మొత్తం ఇసుక దోచేశారు
కృతిమ కొరత సృష్టించి అధిక« ధరలకు అమ్మకం 
ప్రభుత్వానికి ఆదాయం లేదు. ప్రజలకు మేలు లేదు
అదే ఈ ప్రభుత్వ ఇసుక పాలసీ. దోచుకునే పద్ధతి
తేల్చి చెప్పిన  వైయస్‌ జగన్‌
లిక్కర్‌ పాలసీ అంటూ మరో దోపిడికి బాబు స్కెచ్‌
ప్రభుత్వ ఆధ్వర్యంలోని వైన్‌షాప్‌లన్నీ ఏకంగా రద్దు
తన వారికే మద్యం షాప్‌లు దక్కేలా అన్ని చర్యలు
ఆ విధంగా లిక్కర్‌ డిస్ట్రిబ్యూషన్‌పై పూర్తి కంట్రోల్‌
ఇక పర్మిట్‌రూమ్‌లు. బెల్టు షాప్‌లు సరేసరి
ఆ తర్వాత ఎమ్మార్పీ కంటే ఎక్కువకు మద్యం
సీఎం, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాఫియాలో పంపకం
వైయస్‌ జగన్‌ వెల్లడి
స్కిల్‌స్కామ్‌పైనా చంద్రబాబు నిస్సిగ్గుగా వ్యవహారం
ఈడీ ఆస్తులు అటాచ్‌ చేస్తే, తనకు క్లీన్‌చిట్‌ అని ప్రచారం
స్కిల్‌ స్కామ్‌లో ఈడీ నిజాలన్నీ నిగ్గు తేలుస్తోంది
అందుకే పలువురి అరెస్ట్‌. ఆస్తులూ అటాచ్‌మెంట్‌
అయినా అబద్ధాలకు రెక్కలు కట్టి అసత్య ప్రచారం
చంద్రబాబుకు చురకలంటించిన వైయస్‌ జగన్‌
విజయవాడ వరద సాయంలోనూ చేతివాటం
వందల కోట్ల అవినీతి. ఎక్కడికక్కడ నిధుల కైంకర్యం
ప్రశ్నిస్తే మీడియాపైనే కత్తి. సాక్షి పత్రికపై కేసు నమోదు
నియంతలా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం
ఇంత దారుణంగా ప్రభుత్వ పరిపాలన
పరిపాలించడానికి వీళ్లు అసలు యోగ్యులేనా?
:సూటిగా ప్రశ్నించిన  వైయస్‌ జగన్‌
ఈవీఎంలపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది
పోలైన ఓట్లతో వీవీ ప్యాట్‌లు లెక్కించాల్సిందే
అంతేకానీ, మాక్‌ పోలింగ్‌ కాదు. ఈసీ స్పందన సరికాదు
ప్రజాస్వామ్యం ఉండడమే కాదు.. ఉన్నట్టు కనిపించాలి
ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడం కూడా ముఖ్యం
ప్రెస్‌మీట్‌లో  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
న్యూస్‌తెలుగు/తాడేపల్లి: దాదాపు 5 నెలలు అవుతోంది. ఈ ప్రభుత్వం వచ్చి. కానీ మా ప్రభుత్వంలో మాదిరిగా ఎక్కడా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) లేదు.
ఉన్నదల్లా డీపీటీ. అంటే దోచుకో. పంచుకో. తినుకో. ఈ పాలన మాత్రమే 5 నెలలుగా కనిపిస్తోంది. ఈ 5 నెలల్లో ఎక్కడా సూపర్‌ సిక్స్‌ లేదు. సూపర్‌ సెవెన్‌ లేదు. వాటిపై ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అని చెప్పి, కనీసం వార్షిక బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టకుండా ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌తో నడిపిస్తున్నారు. దేశంలో బహుషా ఎక్కడా ఇలా ఉండదేమో. ఇన్ని నెలల పాటు ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌తో నడుపుతున్న ప్రభుత్వం, ప్రపంచంలోనే ఉండకపోవచ్చు. ఒక్క మన రాష్ట్రం తప్ప. ప్రజలు హామీలపై నిలదీస్తారని చెప్పి, పూర్తి స్థాయి బడ్జెట్‌ లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
దోచుకో పంచుకో తినుకో.. ఎలా సాగుతోందంటే.. ఇసుక మొదలు మద్యం. ఆ తర్వాత పేకాట క్లబ్‌లు. విచ్చలవిడిగా, ఎక్కడ పడితే అక్కడ అవి కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఎవరైనా మైనింగ్‌ చేసుకున్నా, పరిశ్రమ ఏర్పాటు చేసినా, కప్పం కట్టనిదే ఏ ఒక్కరూ ఏ పని చేయలేని పరిస్థితి. ఎమ్మెల్యేకు ఇంత. సీఎంకు ఇంత. రాష్ట్రవ్యాప్తంగా దోచుకో తినుకో పంచుకో అన్న విధంగా మాఫియా పని చేస్తోంది.
ఎన్నికల ముందు ఏం చేశారు?:
వారు చేస్తున్న మోడస్‌ ఆపరండీ ఒకసారి గమనిస్తే.. వారి పద్ధతి ఎలా ఉంటుంది అంటే.. ఎన్నికలప్పుడు వారేం చెబుతారు. ఒక అబద్ధానికి రెక్కలు కడతారు. ప్రజల ఆశలతో చెలగాటం ఆడుతారు. వాళ్లకున్న మీడియా సామ్రాజ్యం.. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5. అంతా కలిసి ఏకమై గోబెల్స్‌ ప్రచారం చేస్తారు. ఈ మా«ధ్యమాలన్నీ ఏకం అవుతాయి. అందరూ కలిసి అబద్ధాలకు రెక్కలు కడతారు. ప్రజల ఆశలతో చెలగాటం అడుతారు.
వారికి సంబంధించిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలను ఎలా వాడుకుంటారు అంటే.. వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని మోసం చేస్తారు. అక్కడి నుంచి మోసం మొదలవుతుంది. అలా వారిని మోసం చేయడమే కాకుండా.. ఇంకా ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? వారి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇల్లిల్లూ తిరిగారు. మైక్‌లు పట్టుకుని ఊదరగొట్టారు.
ఆ ఇంట్లో చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని చెప్పి సంతోషమా? అని అడుగుతారు. ఆ చిన్న పిల్లల అమ్మలు కనబడితే నీకు రూ.18 వేలు సంతోషమా? అని అడుగుతారు. ఆ చిన్నపిల్లల చిన్నమ్మ కనబడినా అదే అడుగుతారు. ఆ చిన్నపిల్లల పెద్దమ్మలు లేదా ఆ తల్లి అత్త కనిపిస్తే నీకు రూ.48 వేలు సంతోషమా? అని అడుగుతారు. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పిల్లవాడు కనిపిస్తే, నీకు రూ.36 వేలు సంతోషమా? అని అడుగుతారు. మెడలో కండువా వేసుకుని రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు సంతోషమా? అని అడుగుతారు.
ఇలా ఇంట్లో ఎంత మంది ఉన్నా, ఎవరున్నా కూడా, ఇదే మాదిరిగా ప్రతి ఇంటికి వెళ్లి, ఇవే మాటలు రిపీటెడ్‌గా చెప్పి, ప్రజల ఆశలతో చెలగాటం ఆడి అధికారంలోకి రావడం మోడస్‌ ఆపరెండా.
అధికారంలోకి వచ్చిన తర్వాత..:
అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమిటి? మళ్లీ మోడస్‌ ఆపరెండీ ఏమిటి? రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది. చేయాలని ఉన్నా, నేను చేయలేకపోతున్నానని చెప్పడం. అంతటితో ఇది ఆగిపోదు. మళ్లీ ఏం చేస్తారు? ఎవరైనా ప్రశ్నిస్తారో అని, ఎవరైనా అడుగుతారో అని, వారిని భయభ్రాంతులకు గురి చేయడం, అడిగే స్వరాలను మాట్లాడకుండా చేయాలని ఆరాటపడడం.. వీటన్నింటికి తోడు, మేము మారుస్తున్నాం. మార్పులు తీసుకొస్తున్నాం అని మార్పులు తీసుకొచ్చే క్రమంలో మార్పుల పేర్లు చెబుతూ, స్కామ్‌లకు తెర లేపుతున్నారు. అదీ వారి మోడస్‌ ఆపరెండా.
అందులో భాగంగా వారు చేస్తున్న అవినీతి కార్యక్రమాల గురించి కొన్ని ఉదాహరణలు వివరిస్తాను.
అవినీతి వ్యవహారం–ఇసుక:
ఇందులో మొదటిది ఇసుకకు సంబంధించి, ఎంత దారుణమైన స్కెచ్‌లు గీశారనేది చెబుతాను. ఎన్నికలప్పుడు ఏమన్నారు? ఇసుకకు చాలా ఎక్కువ రేటు ఉందని వాదించారు. ఇప్పుడు ఇదే చంద్రబాబును, కూటమిని ఒకటే అడుగుతున్నాను.
రాష్ట్రంలో ఈరోజు దాదాపు 141 నియోజకవర్గాలలో లారీ ఇసుక ధర రూ.20 వేలకు పైగా ఉంది. దాదాపు 53 నియోజకవర్గాలలో లారీ ఇసుక రేటు సగటున రూ.30 వేలకు పైగా ఉంది. ఇంకొన్ని నియోజకవర్గాల్లో లారీ ఇసుక ధర ఏకంగా రూ.60 వేలకు పైగానే ఉంది.
ఒకవైపున ఇసుక ఉచితం అంటారు. మరోవైపున చూస్తే.. ప్రభుత్వానికి గతంలో ఆదాయం వస్తే, ఇప్పుడు సున్నా అయిపోయింది. మరోవైపు గతంలో కన్నా ఇప్పుడు రెండు, మూడు రెట్లు ఎక్కవ ధర అయింది. గత ప్రభుత్వం స్టాక్‌ యార్డుల్లో 80 లక్షల టన్నుల ఇసుక పెడితే, వీరి ప్రభుత్వం రాగానే,  నెల రోజుల కూడా తిరక్కముందే, అడ్డగోలుగా దోచేశారు. స్టాక్‌యార్డులు ఖాళీ. ఇవన్నీ వాస్తవాలు. ఔనా? కాదా?.
ఇసుక టెండర్లు. అవినీతి:
వీళ్ల దోపిడి ఏ స్థాయిలో ఉందన్న విషయం.. ఒకసారి ఇసుక టెండర్‌ ప్రాసెస్‌ చూడండి. గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా?
స్లైడ్‌ చూపుతూ.. పీపీటీ చూపుతూ..
టెండర్‌కు కేవలం 2 రోజుల టైమ్‌ ఇచ్చారు. 108 రీచ్‌లకు టెండర్లు పిల్చారు. అది కూడా దసరా పండగ ముందు. ఈనెల 8న టెండర్‌ పిల్చి రెండు రోజుల్లో, అంటే 10వ తేదీన క్లోజ్‌ చేశారు. ఇలా ఎక్కడైనా ఉంటుందా? ఎవరైనా ఇలా చూశారా?.
ఎవరూ టెండర్లలో పాల్గొనవద్దు. ఎవరైనా పాల్గొంటే వారిని బెదిరించడం. ఒక మాఫియాలా మారి, గవర్నమెంటే దగ్గర ఉండి తమ వారి చేత దోచేసే కార్యక్రమం. ఎవరికీ తెలియకుండా తమ మాఫియాకు ఇదంతా కట్టబెట్టడం, ఆ తర్వాత నీకింత? నాకింత? అని పంచుకోవడం.
2014–19 మధ్య అదే తంతు:
నేను అడుగుతున్నాను. ఇంత దారుణంగా మోడస్‌ ఆపరెండీ నడుపుతున్నారు మాఫియా సామ్రాజ్యంలో. 2014–19 మధ్య గమనిస్తే, అప్పుడు కూడా ఇదే మోడస్‌ ఆపరెండి. అప్పుడు కూడా దోచుకో తినుకో పంచుకో. అదే పద్ధతి.
అప్పట్లో ఇసుక సామ్రాజ్యం ఇదే మాదిరిగా. మొట్టమొదటగా డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నట్లు బిల్డప్‌ ఇచ్చారు. రెండు నెలలు కాకుండానే దాన్ని రద్దు చేసి, ఉచిత ఇసుక అంటూ ఒక మెమో ఇచ్చి, తనకు కావాల్సిన మనుషులకు ఇసుక కాంట్రాక్ట్‌లు అప్పగించడం. చంద్రబాబు ఇంటి పక్కనే పొక్లెయినర్లు పెట్టి, యథేచ్ఛగా మైనింగ్‌ చేయడం మన కళ్లెదుటే చూశాం.
ఈరోజు సేమ్‌ టు సేమ్‌. ఈరోజు బీజేపీతో భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి, ఏ మాత్రం భయం లేదు. నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. ఇష్టం ఉన్నట్లు దోచుకుంటున్నారు. దసరా పండగ సమయంలో రెండు రోజుల టైమ్‌ మాత్రమే ఇచ్చి, టెండర్లు పిల్చి, దోచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
నాడు ప్రభుత్వానికి ఆదాయం:
గతంలో మా ప్రభుత్వ హయాంలో ఇసుక పాలసీ ఎంత పారదర్శకంగా ఉందంటే, దోపిడికీ ఏ మాత్రం అవకాశం లేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ ప్లాట్‌ఫామ్‌ మీద ఈ–టెండరింగ్‌. కంప్యూటర్‌ ఉంటే చాలు, ఎవరైనా పార్టిసిపేట్‌ చేయొచ్చు. పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చే విధంగా, అత్యధిక బిడ్డర్‌ను ఎంపిక చేసి, రూ.475కు వారికి మైనింగ్‌ చేసేలా కాంట్రాక్ట్‌ ఇచ్చి, అందులో రూ.375 ప్రభుత్వానికి కచ్చితంగా రాయల్టీ కట్టాలని నిర్దేశించాం. ఆ విధంగా ఏటా ప్రభుత్వానికి రూ.750 కోట్లు ఆదాయం వచ్చేలా, పారదర్శకంగా, ఈ–టెండర్ల ద్వారా, కేంద్ర ప్రభుత్వ ప్లాట్‌ఫామ్‌ల మీద టెండర్లు పిల్చాం.
అదే ఇప్పుడు సున్నా:
అదే ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం సున్నా. పేరుకు మాత్రమే ఉచిత ఇసుక. ఎక్కడ, ఎవరికి ఉచిత ఇసుక ఇస్తున్నారు? మా హయాంలో ఏ నియోజకవర్గంలో ఎంత ధరకు ఇసుక అమ్మాలని చెప్పి, ప్రతి వారం పేపర్లలో ప్రకటన వేశాం. చివరకు టీడీపీ గెజిట్‌ పత్రిక ఈనాడులో కూడా ఆ ప్రకటనలు ఇచ్చాం. అలా రీజనబుల్‌ రేట్లకు ఇసుక అమ్మాం. మరోవైపు ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చింది.
అదే ఈరోజు ప్రభుత్వ ఆదాయం సున్నా. మరోవైపు ఇసుక రేట్లు చూస్తే, అప్పట్లో కంటే రెండింతలు, మూడింతల ధరకు అమ్ముతున్నారు. దోచేసి ఇసుక కొరత సృష్టిస్తున్నారు. ఇష్టం వచ్చిన ధరకు ఇసుక అమ్ముతున్నారు.
అవినీతి వ్యవహారం–లిక్కర్‌:
స్కామ్‌లు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చెప్పడానికి మరో ఉదాహరణ లిక్కర్‌. ఎన్నికలప్పుడు ఇదే ఎల్లో మీడియా ఏ స్థాయిలో అబద్దాలకు రెక్కలు కట్టి, ప్రచారం చేసిందో చూస్తే, ఆశ్చర్యం కలుగుతుంది.
మద్యం అన్నది చంద్రబాబు హయాం అయినా, అంతకు ముందు హయాం అయినా, మన హయాం అయినా.. అవే డిస్టిల్లరీలు. అదే లిక్కర్‌ స్పెపిఫికేషన్స్‌.
రాష్ట్రంలో 20 డిస్టిల్లరీలు ఉంటే, వాటిలో 14 డిస్టిల్లరీలకు లైసెన్సులు వచ్చింది చంద్రబాబు హయాంలోనే. మిగిలిన ఆరు డిస్టిల్లరీలకు అంతకు ముందు లైసెన్సులు వచ్చాయి. మా ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టిల్లరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అప్పుడు, మా ప్రభుత్వ హయాంలో కూడా అవే డిస్టిల్లరీల నుంచి లిక్కర్‌ సరఫరా అయింది.
అయినా అబద్ధాలకు రెక్కలు కట్టి, దుష్ప్రచారం చేశారు. ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేశారు. నాసి రకం మద్యం సరఫరా చేశామని ఆరోపించారు. అదే చంద్రబాబు వస్తే, లిక్కర్‌ క్వాలిటీ పెంచి, రూ.99కే ఇస్తాడని అదేపనిగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
లిక్కర్‌ను చంద్రబాబు ఏ విధంగా స్కామ్‌ల కింద మారుస్తాడని చెప్పడానికి మరో ఉదాహరణ. ఎన్నికల తర్వాత పరిస్థితి ఏమిటన్నది చూస్తే, 5 నెలలు అయిపోయింది. చంద్రబాబు హయాంలో బ్రాండ్లు ఒకసారి చూస్తే, ఆశ్చర్యం కలుగుతుంది. లిక్కర్‌ బ్రాండ్లు ఏవైనా తేడా ఉండదు. అయితే ఏ డిస్టిల్లరీ నుంచి కరెక్టుగా వస్తుంది అన్న దాంట్లోనే తేడా వస్తుంది.
చంద్రబాబు హయాంలో లిక్కర్‌ బ్రాండ్లు చూస్తే..
– బూమ్‌ బూమ్‌ బీర్, ప్రెసిడెన్స్‌ మెడల్‌ ఫైన్‌ విస్కీ, గవర్నర్స్‌ ఛాయిస్,  ట్రిపుల్‌ 9 పవర్‌ స్టార్, రష్యన్‌ రోమనోవా, ఏసీబీ, 999 లెజండ్‌ విస్కీ, హెవెన్స్‌ డోర్, క్రేజీ డాళ్, క్లిఫ్‌ హేంగర్, గవర్నర్స్‌ రిజర్వ్, నెపోలియ¯Œ,, ఆక్టన్, సెవెన్త్‌ హెవెన్, హైదరాబాద్‌ బ్రాండ్‌ విస్కీ, వీరా, బ్లామ్‌డే, లెజెండ్, క్లిఫ్‌ హ్యాంగర్‌ , హైవోల్టేజ్‌ గోల్డ్‌ బీర్, ఎస్‌ఎన్‌జె బీర్‌..
ఇలా రకరకాల బ్రాండ్లు. చివరకు చంద్రబాబు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా, ఆయన కొన్ని బ్రాండ్లకు అనుమతి ఇచ్చాడు. మే 14, 2019న కూడా అనుమతి ఇచ్చాడు. దాంట్లోనే బూమ్‌ బూమ్‌ బీర్‌ కూడా ఉంది. కానీ ఇప్పుడేమంటున్నాడు. అది మన ప్రభుత్వంలో ఇచ్చామని.
అవే డిస్టిల్లరీలు. అవే బ్రాండ్లు:
నేను ఒక విషయం చెబుతున్నాను. అవే డిస్టిల్లరీలు. అవే బ్రాండ్లు.
చంద్రబాబు హయాంలో అవే డిస్టిల్లరీల నుంచి అదే క్వాలిటీతో లిక్కర్‌ సరఫరా అయింది. అయినా నాసిరకం మద్యం అంటూ, మా ప్రభుత్వంపై విపరీతంగా దుష్ప్రచారం చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చి, 5 నెలలు అవుతోంది. అదే మద్యం సరఫరా అవుతోంది కదా? అవే బ్రాండ్లు కదా?. ఒక పద్ధతి ప్రకారం మాఫియాను నడుపుతున్నారు.
నాడు మద్య నియంత్రణ:
మా ప్రభుత్వ హయాంలో మద్యం వినియోగాన్ని నిరుత్సాహపర్చాం. దాదాపు 4380 షాపులు ఉంటే, దాన్ని 2934 షాప్‌లకు తగ్గించాం. అంటే దాదాపు 30 శాతం షాప్‌లు తగ్గించాం. లాభాపేక్ష ఉంటే మద్యాన్ని నియంత్రించలేం కాబట్టి, పాలసీ మార్చి ప్రభుత్వమే స్వయంగా వైన్‌షాప్‌లు నడిపింది. మద్యం విక్రయ వేళల్ని తగ్గించాం. ఇంకా పర్మిట్‌రూమ్‌లు రద్దు చేశాం. ఇంకా చంద్రబాబుగారి హయాంలో ఉన్న 43 వేల బెల్టుషాప్‌లు కూడా రద్దు చేశాం. ఎక్కడా లాభాపేక్ష లేకుండా వ్యవహరించాం. రేట్లు కూడా పెంచాం. ఎందుకంటే మద్యం వినియోగాన్ని నియంత్రించే విధంగా ఆ పని చేశాం.
అలా మన ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు తగ్గించినా, ఆదాయాన్ని కంటిన్యూ చేయగలిగాం. ఒకసారి మద్యం విక్రయాలు, ప్రభుత్వ ఆదాయం చూస్తే.. అంటూ పీపీటీ ఇచ్చారు.
చంద్రబాబు హయాంలో ఏటా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
చంద్రబాబు పాలన మొదలైన 2014–15లో ఐఎంఎల్‌ మద్యం కేసులు 2.88 కోట్లు అమ్ముడుపోతే, అది 2018–19 నాటికి 3.84 కోట్ల కేసులకు పెరిగింది.
అదే విధంగా బీర్ల అమ్మకాలు చూస్తే, 2014–15లో 1.74 కోట్ల కేసుల నుంచి 2018–19 నాటికి 2.77 కోట్ల కేసులకు పెరిగింది.
మా హయాంలో ఆదాయం పెరిగింది:
అదే మేము కూడా చంద్రబాబు మాదిరిగా వ్యవహరించి ఉంటే, మద్యం అమ్మకాలు పెరిగేవి. మేము మద్యం వినియోగాన్ని నియంత్రించే చర్యలు చేపట్టడంతో అంతకు ముందు మాదిరిగా విక్రయాలు పెరగలేదు. అందుకే మన ప్రభుత్వ హయాంలో చూస్తే.. చంద్రబాబు తన హయాంలో చివరి సంవత్సరంలో అమ్మకాల కంటే, 5 ఏళ్ల తర్వాత మన హయాంలో చివరి ఏడాది మద్యం విక్రయాలు తగ్గాయి. అదే సమయంలో ఆదాయం తగ్గలేదు.
మన చర్యల వల్ల ప్రభుత్వ ఆదాయం రూ.17,682 కోట్ల నుంచి రూ.25,082 కోట్లకు పెంచాం. మద్యం విక్రయాలు తగ్గించాం. పేదల ఆరోగ్యాన్ని కాపాడాం. మరోవైపు ప్రభుత్వానికి ఆదాయం పెంచాం.
మద్యంలో బాబు దోపిడి:
మరి ఈరోజు చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఏం చేశారనేది చూస్తే, ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రబాబు దోపిడి ఏ రకంగా జరుగుతోంది అంటే.. ఆయన ఒకవైపు మద్యం రేటు తగ్గిస్తాడట. అంటే తద్వారా క్వాలిటీ తగ్గించి, ప్రభుత్వానికి ఆదాయం తగ్గించి, డిస్టిల్లరీలకు మాత్రం వ్యాపారం పెంచి, తన సొంత ఆదాయాన్ని లంచాల రూపంలో పెంచుకుంటూ.. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తగ్గించే కార్యక్రమం ఒకవైపు చేస్తున్నాడు.
మరోవైపు ప్రభుత్వ రంగంలో నడుస్తున్న షాప్‌లను పూర్తిగా రద్దు చేశాడు. అవి ఇప్పటి వరకు పూర్తి పారదర్శకంగా పని చేశాయి. అప్పుడు ప్రభుత్వం స్వయంగా మద్యం అమ్మింది కాబట్టి, సాయంత్రం కాగానే, ఆ మొత్తం ప్రభుత్వం బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసేది.
ఈరోజు చంద్రబాబు ఏం చేశారు. ప్రభుత్వం నడుపుతున్న షాప్‌లన్నీ రద్దు చేసి, తన మాఫియా సామ్రాజ్యానికి ఆ షాప్‌లన్నీ కట్టబెట్టాడు. మద్యం షాప్‌ల్లో ఈరోజు ఏరకమైన స్కామ్‌లు జరుగుతున్నాయంటే.. అందుకు చంద్రబాబు ఏ రకమైన స్కెచ్‌ వేశారంటే..
మద్యం షాప్‌లన్నీ తన మాఫియాకే ఇవ్వడం.. మనమంతా చూస్తూనే ఉన్నాం. 30 శాతం ఇస్తారా? 20 శాతం ఇస్తారా? అంటూ బెదిరించడం. దౌర్జన్యం చేయడం, కిడ్నాప్‌లు చేయడం. వీళ్లకు సంబంధించిన వాళ్లే షాప్‌లు తీసుకోవడం, మిగిలిన వాళ్లు ఎవరైనా షాప్‌ల కోసం టెండర్లు వేస్తే, పోలీసులే స్వయంగా వెళ్లి బెదిరించారు. మీరు మద్యం అమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి, టెండర్లలో పాల్గొనవద్దని బెదిరించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇంతే. చంద్రబాబుకు ఇంత, ఎమ్మెల్యేకు ఇంత. మద్యం మాఫియాకు ఇంత.
మద్యం పాలసీ నిజంగా మంచిదైతే?:
నిజంగా ఈ లిక్కర్‌ పాలసీ మంచిదైతే, మంచిచేసేదే అయితే, ఎమ్మెల్యేలు ఈ మాదిరిగా కిడ్నాప్‌లు చేయాలి? వారు ఎందుకు ఈ మాదిరిగా దాడులు చేస్తున్నారు?. వారు ఎందుకింతగా బెదిరిస్తున్నారు? ఇదంతా ఎందుకు జరుగుతోంది?.
రేపు ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ రేటుకు అమ్ముతారు. ఆ రేటులో నీకింత, నాకింత అని పంచుకుంటారు. ఇప్పటికే అది స్టార్ట్‌ అయింది. మన హయాంలో రూ.120కి అమ్మే చీప్‌ లిక్కర్, ఈరోజు బజార్లో రూ.130కి ఎమ్మార్పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. ఇక రెండు రోజులు పోతే, పర్మిట్‌రూమ్‌లు పక్కనే. నాలుగు రోజులు పోతే బెల్ట్‌ షాప్‌లు. గ్రామస్థాయిల్లో మాఫియా సామ్రాజ్యం.
ఏది క్వాలిటీ లిక్కర్‌?:
ఇదే చంద్రబాబునాయుడు, ఇదే పెద్దమనిషి రూ.99కే మద్యం ఇస్తామని చెప్పాడు. ఇది కూడా ఒక స్కామే. కొద్ది రోజులు ఆగితే, ఆ స్కామ్‌ కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే రూ.120కి ఇచ్చే మద్యంలో క్వాలిటీ ఉంటుందా? రూ.99కే ఇచ్చే లిక్కర్‌ క్వాలిటీగా ఉంటుందా?. అంటే ఆ లిక్కర్‌లో ఏం చేయబోతున్నాడు. సారాయిలో ఇంత రంగు పోసి బాట్లిళ్లలో పోసి అదే అమ్ముతాడా? ప్రజల జీవితాలే కాకుండా, వారి ప్రాణాలతోనే చెలగాటం ఆడుతారా?.
ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం చూడాల్సిన విషయం. తను చేయబోయే స్కామ్‌ను సెట్‌రైట్‌ చేయడం కోసం, పూర్తిగా డిస్ట్రిబ్యూషన్‌ను ఛానల్‌ను కంట్రోల్‌లోకి తీసుకున్నాడు తన వాళ్లే షాప్‌లు నడిపే విధంగా, వారికే షాప్‌లు ఇప్పించి, పూర్తిగా కంట్రోల్‌లోకి తీసుకున్నాడు.
స్కిల్‌ స్కామ్‌. పచ్చి అబద్దాల ప్రచారం:
చంద్రబాబునాయుడుగారి అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయి? ఆయన అబద్ధాలకు ఎలా రెక్కలు కడతారు అంటే.. ఈ స్కిల్‌స్కామ్‌ను ఒకసారి గమనిద్దాం. ఈ స్కిల్‌స్కామ్‌కు సంబంధించి నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి. అసలు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే.. ఈ మధ్య ఈడీ ఒక ప్రెస్‌ రిలీజ్‌ ఇచ్చింది.
అంటూ.. ఆ ప్రెస్‌నోట్‌ను పీపీటీలో చూపారు.
ఈడీ ప్రెస్‌నోట్‌లో ఏముందనేది ఒక్కసారి చదువుతా.. అందులో ఇంపార్టెంట్‌ పాయింట్స్‌ చదువుతా. ఎందుకంటే ఇక్కడున్న జర్నలిస్టులంతా బాగా చదువుకున్న వారే కదా?. ఈడీ ప్రెస్‌నోట్‌లో ఏం రాశారనేది చూద్దాం.. అంటూ ఆ నోట్‌ పూర్తిగా చదివి వినిపించారు.
వాస్తవంగా ఇందులో ఏముంది? అంటూ ఈడీ ప్రెస్‌రిలీజ్‌ను కూలంకషంగా చదివారు.
ఈడీ ప్రెస్‌ రిలీజ్‌లో ఏముంది?:
ఈ రిలీజ్‌ చదివితే ఎవరికైనా ఏం అర్ధం అవుతుంది. వారందరినీ ఎందుకు అరెస్టు చేశారు?. ఆ ప్రాపర్టీస్‌ ఎందుకు అటాచ్‌ చేశారు?. చంద్రబాబుగారితో పాటు, వారంతా కూడా నిందితులే. ఈ కేసులో సుమన్‌బోస్, వికాస్‌ వినాయక్‌ ఖన్వేల్కర్, ముకుల్‌చంద్ర అగర్వాల్, సురేష్‌ గోయల్‌.. వీరంతా నిందితులే. వారి నుంచి ఇప్పటికే రూ.31.20 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేయగా, తాజాగా మరో రూ.23.54 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ప్రకటించింది. దానికి సంబంధించి ఈడీ ప్రెస్‌నోట్‌ ఇచ్చింది.
నేను అడుగుతున్నాను.
ఈడీ ఇంత క్లియర్‌కట్‌గా చెప్పింది. చంద్రబాబుగారే ప్రభుత్వ డబ్బు రూ.371కోట్లు ఇచ్చాడు. 13 చోట్ల, 13సార్లు ఆయన స్వయంగా సంతకాలు పెట్టారు. రూ.371 కోట్లు వారికి ఇచ్చారు. ఆ డబ్బును వారు షెల్‌ కంపెనీల ద్వారా రూట్‌ చేశారని, దాన్ని కనుగొన్నామని ఈడీ స్పష్టం చేసింది.
చంద్రబాబు ఏం చెప్పుకున్నారు!:
అయితే టీడీపీ అఫీషియల్‌ వెబ్‌సైట్‌లో చంద్రబాబు ఏమన్నారు? న్యాయం గెలిచింది అని. నాకు ఆశ్చర్యం కలిగించింది. అబద్ధానికి రెక్కలు కట్టడంలో ఈ మనిషి పీహెచ్‌డీ చేశారు.
అంటూ.. చంద్రబాబు ట్వీట్‌ను చదివి వినిపించారు.
అసలు ఆయన మనుషులను ఏమనుకుంటున్నాడు? వారికి చదువు రాదనుకుంటున్నాడా? వారికి తెలియదనుకుంటున్నాడా?. ఎంత ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వంటి మీడియా సామ్రాజ్యం ఉంటే మాత్రం, ఎంత గోబెల్స్‌ ప్రచారం చేయగలం అన్న అతి విశ్వాసం ఉంటే మాత్రం, ఈ మాదిరిగా వక్రీకరించడం అనేది ఎవరు చేయగలరు?
ఇదే స్కామ్‌కు సంబంధించి, నిందితుల ఆస్తులు ఈడీ అటాచ్‌ చేస్తే, దానికి సమాధానం అడిగితే చెప్పడు.
మరోవైపు ఆయన ఇష్టం వచ్చినట్లు రాసుకుంటాడు. దానికి ఆయన అనుకూల మీడియా వత్తాసు పలుకుతుంది. ఈడీ ప్రెస్‌నోట్‌ రాగానే, చంద్రబాబు ఈ మాదిరిగా అబద్ధాలకు రెక్కలు గట్టి ప్రచారం చేస్తున్నాడు. అసలు ఆయన ఈ మాదిరిగా అబద్దాలకు ఎందుకు రెక్కలు కడుతున్నారు?. ఈడీ ప్రెస్‌ నోట్‌లో ఎక్కడైనా చంద్రబాబుకి క్లీన్‌ చిట్‌ ప్రస్తావన ఉందా..? కేసులో అరెస్ట్‌ అయిన సుమన్‌ బోస్, వికాస్‌ ఖల్వేకర్‌లకు ఈ డబ్బులు, అటాచ్‌ అయిన ఆస్తులకు డబ్బులు ఎవరిచ్చారు?. చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేసి రూ. 371 కోట్లు విడుదల చేయడం వాస్తవం కాదా?
సీమెన్స్‌ కంపెనీ ఏం చెప్పింది?:
సీమెన్స్‌ కంపెనీయే ఆ డబ్బు మాకు ముట్టలేదు. మాకు సంబంధం లేదని చెప్పడం వాస్తవం కాదా?. జర్మనీలో ఉన్న సీమెన్స్‌ ఓరిజినల్‌ కంపెనీ నోయిడా మెజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇవ్వడం వాస్తవం కాదా? ఈ డబ్బు పక్కదారి పట్టిన విషయాన్ని సీమెన్స్‌ సంస్థ తమ అంతర్గత విచారణలో కనుగొన్నామని, అది తమ ఇండియా విభాగానికి చెందిన మాజీ ఎండీ సుమన్‌బోస్‌ కంప్యూటర్లు, ఫోన్లు పరిశీలిస్తే బయటకు వచ్చిందని, డబ్బు పూణె నుంచి హైదరాబాద్‌కి వెళ్లిందని, సాక్షాత్తూ సీమెన్స్‌ రిపోర్టు ఇచ్చిన విషయం వాస్తవమా కాదా?. రాబోయే రోజుల్లో చంద్రబాబునాయుడును, ఆయన పీఏ శ్రీనివాస్‌ను ఈడీ అరెస్టు చేయదా?
ఇవన్నీ వాస్తవాలు కాదా?:
ఇలా బయటకు పోయిన డబ్బును దారి మళ్లించిన మాట వాస్తవం కాదా? అలా బయటకు వెళ్లిన సొమ్ము మళ్లీ తిరిగి హవాలా మార్గంలో చంద్రబాబు జేబుల్లోకి చేరడం వాస్తవం కాదా? దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకోవడం అంటే ఇది కాదా?.
ఐఏఎస్‌ అధికారులు ఇద్దరు మెజిస్ట్రేట్‌ ముందు 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. తాము చంద్రబాబుగారి ఆదేశాల మేరకే డబ్బు విడుదల చేశామని. ఇది వాస్తవం కాదా?
ఇవన్నీ కళ్ల ఎదుటే కనిపిస్తుంటే.. చంద్రబాబునాయుడు ఏమంటాడు? న్యాయం గెలిచింది. నిజం నిల్చింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అక్రమ కేసు పెట్టిన జగన్‌కు చెంపపెట్టులా, చంద్రబాబుగారికి ఎటువంటి సంబంధం లేదని ఈడీ క్లీన్‌చిట్‌ ఇచ్చిందని, చంద్రబాబు అంటారు.
ఇంత దారుణమైన స్కామ్‌. కంటికి కనిపించే విధంగా ఆధారాలు. ఈడీ సైతం యాక్టివ్‌గా ఇన్వెస్టిగేట్‌ చేస్తోంది. ఈడీ సైతం ఇది వాస్తవమని ధృవీకరించుకున్న తర్వాత అటాచ్‌మెంట్, అరెస్టులు చేశారు.
ఇలాంటి వారు మనుషులేనా?:
కానీ చంద్రబాబుగారు ఏమంటున్నారు. తిరుమల లడ్డూల విషయం మాదిరిగా మీకు అనిపించడం లేదా?.
అబద్ధాలకు రెక్కలు కట్టే విషయంలో.. అది లడ్డూల విషయంలో కానీ, అది ఈ మాదిరిగా ఈడీ అటాచ్‌మెంట్లు కానీ, ఇసుక కానీ, మద్యం కానీ.. తప్పులన్నీ చేస్తారు. మళ్లీ అబద్దాలకు రెక్కలు కడతారు. అసలు నిజంగా వీళ్లు మనుషులేనా? ఇలాంటి వారంతా మనుషులేనా? ఆలోచన చేయమని కోరుతున్నా.
వరదసాయం–స్కామ్‌:
వీరి స్కామ్‌లన్నీ ఏ విధంగా ఉన్నాయంటే.. మనమంతా విజయవాడలో చూశాం. మనమంతా సాక్ష్యం. కోటి భోజనాల ఖర్చు రూ.368 కోట్లు అట. అసలు ఎవరికి భోజనం పెట్టారు? అసలు రిలీఫ్‌ క్యాంప్‌లు ఉన్నాయా? మీడియా ప్రతినిధులే సాక్షులు. మీరే సాక్షులు. ఎంతమంది రిలీఫ్‌ క్యాంపుల్లో ఉన్నారు?.
ఇంకా క్యాండిల్స్, మ్యాచ్‌బాక్సులు, మొబైల్‌ జనరేటర్స్‌ అని చెప్పారు. అసలు జనరేటర్స్‌ ఎక్కడ పెట్టారు? అందరూ నీళ్లలో మునిగి ఉంటే ఎవరికి జనరేటర్స్‌ ఏర్పాటు చేశారు? నీళ్లలో ఉన్న వాళ్లు చంద్రబాబు మమ్మల్ని బయటకు తీయడం లేదని గగ్గోలు పెట్టిన పరిస్థితి.
వాస్తవాలు రాస్తే.. కేసు నమోదా?:
అగ్గిపెట్టెలకు, క్యాండిల్స్, మొబైల్‌ జనరేటర్లకు ఖర్చు రూ.23 కోట్లు అంట.. ఏ విషయంలోనైనా దారుణమైన స్కాంలు. ఇవే అంశాలు రాసిందని సాక్షి ఎడిటర్‌మీద కేసు నమోదు చేశారు.
అంటే వీళ్లు ఏం చేసినా ఎవరూ ప్రశ్నించకూడదు. ఎవరూ మాట్లాడకూడదు. మాట్లాడితే కేసులు నమోదు చేస్తారు. ఇంత దారుణంగా ప్రభుత్వం పరిపాలన చేస్తుంటే… పరిపాలించడానికి వీళ్లు యోగ్యులేనా? అన్నది ప్రజలు ఆలోచన చేయాలి.
మీడియా ప్రశ్నలకు బదులిస్తూ..
ప్రజలు తిరగబడతారు:
వైయస్సార్సీపీ నాయకులపై కేసులు పెట్టి అరెస్టు చేయడం ద్వారా పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం జరుగుతుందని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ…
బంతిని ఎంత గట్టిగా నేలకు కొడితే అంత గట్టిగా లేస్తుంది. ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిలో కొద్దో గొప్పో పరివర్తన కనపడితే వారి మీద సానుకూలత పెరుగుతుంది. కానీ చేసిన తప్పు కనపడకూడదు, చేసిన తప్పును ఎవరూ మాట్లాడకూడదు.. అధికారంలో ఉన్నప్పుడు ఏ తపై ్పనా చేయవచ్చన్న దృక్పథంతో ఇష్టం వచ్చినట్లు చేస్తే ప్రజలు తిరగబడతారు. ఆరోజు వచ్చినప్పుడు చంద్రబాబునాయుడు, ఆయన పార్టీకి సింగిల్‌ డిజిట్‌ కూడా రాని పరిస్ధితి వస్తుంది.
ప్రజల తరపున పోరాడుతూనే ఉంటాం:
మద్యం మాఫియా, ఇసుక స్కాంలు కళ్లెదుటే జరుగుతున్నాయి. మద్యంపై మహిళలు ఆందోళన చేస్తున్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల తరుపున పోరాడ్డానికి ప్రతి విషయంలో ముందుంటుంది.
తమకు 93 శాతం స్ట్రైక్‌రేట్‌ ఉంది కాబట్టి.. తాము చేసే ప్రతి పనికి ప్రజామోదం ఉందన్న చంద్రబాబు మాటలపై బదులిస్తూ.. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కూటమి ప్రభుత్వం ఇలా చేస్తూ పోతుంటే.. చాలా వేగంగా పతనమవడం ఖాయం.
సన్నద్ధంగా ఉన్నాం:
జమిలి ఎన్నికలు జరగడం మన చేతుల్లో లేని అంశం. అయితే ఏం జరిగినా దానికి సన్నద్ధంగా ఉండడం, పార్టీని సన్నద్ధంగా పెట్టడమే మన చేతుల్లో ఉన్న అంశం.. దానికి సన్నద్ధంగా ఉన్నాం.
ఈవీఎంలపై పోరాటం కొనసాగుతుంది:
ఈవీఎంలకు సంబంధించి మా పార్టీ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈరోజుకీ వైయస్సార్‌సీపీ కోర్టులో వేసిన కేసులు కొనసాగుతున్నాయి.
మేము అడుగుతున్న ఫండమెంటల్‌ ప్రశ్న ఒక్కటే.. ఒంగోలులో 12 బూత్‌లకు సంబంధించి ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు మ్యాచ్‌ చేయమని అడుగుతున్నాం. నిజంగా ఎన్నికల కమిషన్‌ మనసులో కల్మశం లేకపోతే.. మ్యాచ్‌ చేసి చూపిస్తే.. మా సందేహాలు కాకుండా దేశంలోని అందరి సందేహాలు తీరుతాయి. 12 బూత్‌లకు సంబంధించి వెరిఫై చేయాలని డబ్బులు కట్టాం.. కానీ ఎందుకు చేయడం లేదు?. ఇదే ఈసీ హైకోర్టులో సుప్రీంకోర్టు వెరిఫై చేయమని చెప్పలేదు. మాక్‌ పోలింగ్‌ చేయమని చెప్పిందని సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను వక్రీకరిస్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాక్‌ పోలింగ్‌ చేయడం వల్ల ఏం సాధిస్తాం.
చేయాల్సింది ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు లెక్కపెట్టాలి. ఈవీఎంలతో వీవీ ప్యాట్‌లు మ్యాచ్‌ అవుతున్నాయో, లేదో తేల్చాలి. ఇది చేయడం లేదు అంటే అనుమానాలు పెరుగుతాయి. కేవలం ఆరు నెలలు దాటేస్తే వీవీ ప్యాట్‌ల మీద ఇంకు పోతుందని ఎదురు చూస్తున్నారు.
90 శాతం అభివృద్ధి చెందిన దేశాల్లో.. అమెరికాతో సహా పేపర్‌ బ్యాలెట్‌ వాడుతున్నారు. ప్రజాస్వామ్యం ఉండడమే కాదు.. ఉన్నట్టు కనిపించాలి కూడా. ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడం కూడా ముఖ్యం.
అదే అందరూ ఆశిస్తున్నారు:
స్కిల్‌ స్కామ్‌లో అరెస్టులు జరగాలని, నిజం వెలుగులోకి రావాలని.. ప్రభుత్వ సొమ్మ ఆ రూ.371 కోట్లను వీళ్ల అత్తగారి సొత్తులా వీళ్లంతట వీళ్లే కావాల్సిన వారికి ఇవ్వడం, షెల్‌ కంపెనీల ద్వారా మరలా తీసుకోవడం.. ఇలా రకరకాలుగా దోపిడి చేసిన ఆ సొమ్ము రావాలని అందరం ఆశిస్తున్నాం.
ఇది టీడీపీ నాయకుల వ్యవస్థ:
మద్యం దుకాణాల్లో డిజిటల్‌ లావాదేవీల గురించి మాట్లాడుతూ.. గతంలో లిక్కర్‌ షాపులన్నీ ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించినవే. పూర్తి పారదర్శకంగా వాటిని నిర్వహించాం. ఈ ప్రభుత్వంలో షాపులన్నీ ప్రైవేటు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అదీ టీడీపీ నాయకులు నడుపుతున్న వ్యవస్ధ.. అని శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. (Story : ఇది దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) ప్రభుత్వం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1