తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్ట్ పై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలి
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్
న్యూస్తెలుగు/ ములుగు : ములుగు జిల్లా కేంద్రం లోని జిల్లా సూపర్డెంట్ అఫ్ పోలీస్ డాక్టర్ శబరిష్ ని కలిసి, ఇటీవల గత రెండు రోజులు గా ఆంధ్రప్రభ ప్రింట్ పేపర్ లో విలేకరి, తుమ్మల కృష్ణ రెడ్డి నాపై రాసిన అసత్య కధనం పై సమగ్ర విచారణ జరిపి, నా రాజకీయ ఎదుగుదల పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న వారిపై, వారి వెనుక వున్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కి పిటిషన్ ను ఇచ్చిన్నట్లు,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ తెలిపారు.ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు చంద్ పాషా, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవి చందర్,బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి ఇస్సార్ ఖాన్ జిల్లా సీనియర్ నాయకులు బాధం ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు. (Story : తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్ట్ పై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలి)