వై టి పి ఎస్ ప్రభుత్వ పనులను త్వరగా పూర్తి చేయాలి
న్యూస్ తెలుగు\నల్లగొండ : నల్లగొండ జిల్లాలో చేపట్టిన వైటిపిఎస్, ప్రభుత్వ వైద్య కళాశాల, అలాగే మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో ఎస్ జిఎఫ్ కింద మంజూరైన పనులు,ఇతర ప్లాన్ల కింద మంజూరైన వివిధ రకాల ప్రభుత్వ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ఈ పనుల పూర్తికి గాను,వంగమర్తి, గొట్టుముక్కల టీజీఎండిసి రీచుల నుండి ఎలాంటి అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా అవసరమైన ఇసుకను వెంటనే పంపించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.పైన పేర్కొన్న ప్రభుత్వ పనులకు ఇసుకను పని దినాలలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పంపించాలని, అలాగే ఇసుక పంపించే ప్రతి వాహనానికి జిపిఎస్ ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో ఇసుక వాహనాలను పర్యవేక్షించేందుకుగాను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏ ఒక్క ఇసుక వాహనం దుర్వినియోగం చేసినా, లేదా నిర్దేశించిన ప్రకారం కాకుండా ఇతరత్రా పనులకు వినియోగించిన అలాంటి వాహనాలపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రభుత్వం ద్వారా చేపట్టిన అన్ని సివిల్ పనులను పూర్తి చేసేందుకు అవసరమైన ఇసుకను వెంటనే ఇవ్వడం జరుగుతుందని, అదే సమయంలో ఇసుక ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా పోలీస్, రెవెన్యూ, మైనింగ్, టీజీ ఎండిసి శాఖల ద్వారా పూర్తిస్థాయిలో పర్యవేక్షించేందుకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. (Story : వై టి పి ఎస్ ప్రభుత్వ పనులను త్వరగా పూర్తి చేయాలి )