గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం కృషి
న్యూస్‌తెలుగు/ ఏటూరునాగారం : పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలమేరకు,కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అశోక్ సూచనలమేరకు మండల అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో ఏటూరునాగారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యల పై సమావేశం ఏర్పాటు చేసి, కాంగ్రెస్ పార్టీ ఏటూరునాగారం మండల కమిటి అధ్యక్షులు చిట్ట మొట్ట రఘు, నాయకులు మాట్లాడారు.
ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది పెండింగ్ లో ఉన్న జీతాలను ప్రభుత్వం,మంత్రి సీతక్క ద్రుష్టి కి తీసుకెళ్లి,అందించే విధంగా సహాయ చర్యలను తీసుకుంటామని యధావిధంగా ఇతరత రావాల్సిన జీతాలను వచ్చేలాగ చూస్తామని, విధులు యధావిధిగా కొనసాగించాలని,సమ్మె తో మీ అందరి ఆవేదన అర్థమైందని, సిబ్బందికి కార్మికులకు జీతాలు ఇక పై సకాలంలో యధావిధిగా వస్తాయని ఎవరు అధైర్య పడవద్దు తెలపడమైనది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఖలీల్ ఖాన్, జిల్లా అధికార ప్రతినిధి ముక్కెర లాలయ్య,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ పాషా,మండల ఉపాధ్యక్షులు వీసం నర్సయ్య, శివాలయం కమిటీ చైర్మన్ మాడుగురి ప్రసాద్, టౌన్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు ఇరవేణి రాంలాల్,పొలాబోయిన గోపాల్,టౌన్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ల తరుణ్, ఇర్సవడ్ల కిరణ్,కందుకూరి రతన్, తదితరులు పాల్గొన్నారు. (Story : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం కృషి)