అన్న క్యాంటీన్లను నిరంతరం పర్యవేక్షిస్తుండాలి`వీఎంసీ కమిషనర్
న్యూస్‌తెలుగు/విజయవాడ : అన్న క్యాంటీన్లను నిరంతరం పర్యవేక్షిస్తుండాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. అన్నా క్యాంటీన్లు నిర్వాహణపై కమిషనర్ శనివారం స్థానిక వీఎంసీ కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని 11 అన్న క్యాంటీన్లను నిరంతరం పర్యవేక్షణకు నియమించిన 11 మంది నోడల్ ఆఫీసర్లను, 11 మంది పరిశీలన ఆఫీసుర్లు కృషి చేయాలన్నారు. అన్న క్యాంటీన్లలో వసతులు, సమస్యలను సంబందిత అధికారులు 15 నిమిషాల్లో పరిష్కరించాలని ఆదేశించారు. హెచ్‌బీ కాలనీ, ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ అన్న క్యాంటీన్‌లకు నోడల్ ఆఫీసర్‌గా డీఈఈ సతీష్‌కుమార్, పరిశీలన అధికారులుగా వెల్ఫేర్ సెక్రెటరీలు రమ్యకృష్ణ, సురేష్, గాంధీజీ మహిళా కళాశాల అన్న క్యాంటీన్‌కు నోడల్ ఆఫీసర్‌గా టీపీఎస్ ప్రసాద్, పరిశీలన అధికారిగా వెల్ఫేర్ సెక్రెటరీ అశోకరాణి, ధర్నా చౌక్ అన్న క్యాంటీన్ నోడల్ ఆఫీసర్‌గా ఏఎంహెచ్‌వో డాక్టర్ రామకోటేశ్వరరావు, పరిశీలన అధికారిగా వెల్ఫేర్ సెక్రెటరీ రామకృష్ణ, బావజీపేట అన్న క్యాంటీన్ నోడల్ ఆఫీసర్‌గా షేక్-వెల్ఫేర్ సెక్రెటరీ కాసింబి, ఈఈ శ్రీనివాస్, అయోధ్య నగర్ అన్న క్యాంటీన్‌కు నోడల్ ఆఫీసర్‌గా ఏసీపీ జగదీష్, పరిశీలన అధికారిగా వెల్ఫేర్ సెక్రెటరీ రాంబాబు, సింగ్‌నగర్ అన్న క్యాంటీన్‌కు నోడల్ ఆఫీసర్‌గా శానిటరీ సూపర్వైజర్ రమేష్ బాబు, పరిశీలన అధికారిగా వెల్ఫేర్ సెక్రెటరీ ప్రభాకర్‌రావు, ఏపీఎస్‌ఆర్‌ఎంసీ హై స్కూల్ అన్న క్యాంటీన్ నోడల్‌ఆఫీసర్‌గా ఉమామహేశ్వరి, పరిశీలన అధికారిగా వెల్ఫేర్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, రాణిగారితోట అన్న క్యాంటీన్‌కు నోడల్ ఆఫీసర్‌గా డీసీపీ జుబిన్, పరిశీలన అధికారిగా వెల్ఫేర్ సెక్రెటరీ పద్మా, నేతాజీ బ్రిడ్జి వద్ద సాయిబాబా గుడి వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌కు నోడల్ ఆఫీసర్‌గా డీఈఈ ప్రవీణ్ చంద్ర, పరిశీలనాధికారిగా వెల్ఫేర్ సెక్రెటరీ జస్వంత్, పటమట హై స్కూల్ వద్దగల అన్నా క్యాంటీన్‌కు నోడల్ ఆఫీసర్‌గా ఎస్‌ఎస్ సలీం అహ్మద్, పరిశీలన అధికారిగా వెల్ఫేర్ సెక్రెటరీ రాగిణి నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రతి అన్న క్యాంటీన్ నివేదికను అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (Story : అన్న క్యాంటీన్లను నిరంతరం పర్యవేక్షిస్తుండాలి`వీఎంసీ కమిషనర్)