ఆల్ ఇండియా స్టూడెంట్ ఆర్గనైజేషన్ కార్యదర్శిగా నవీన్ కుమార్
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ధర్మవరం పట్టణానికి చెందిన నవీన్ కుమార్ ను ఆల్ ఇండియా స్టూడెంట్ ఆర్గనైజేషన్ జిల్లా కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగిందని రాష్ట్ర సభ్యులు నిరంజన్ యాదవ్ ద్వారా నియమింపబడ్డారు. ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులుగా బీరే శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి పల్లా నవీన్ గా నన్ను కూడా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని, ప్రతి మండలంలోనూ యూనియన్ విద్యార్థి సంఘాన్ని బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా నన్ను జిల్లా కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. (Story : ఆల్ ఇండియా స్టూడెంట్ ఆర్గనైజేషన్ కార్యదర్శిగా నవీన్ కుమార్ )