సిటీయూ టూరిజం గ్రాడ్యుయేట్లలకు ప్లేస్‌మెంట్స్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్‌లోని టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ విభాగం, 2019-2024కి చెందిన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఏంబిఏ తొలి బ్యాచ్ గ్రాడ్యుయేట్లు ,టూరిజం మరియు హాస్పిటాలిటీ పరిశ్రమలో ప్రముఖ కంపెనీల నుండి అద్భుతమైన ఉద్యోగ ఆఫర్‌లను పొందారు. ఈ సంధర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ టి.వి కట్టిమణి ఉద్యోగ అవకాశాలను చేజిక్కించుకున్న విద్యార్థులకు ఆఫర్ లెటర్‌లను అందజేసి విద్యార్థులను, అధ్యాపకులను అభినందించారు. హైదరాబాద్ లోగల ప్రజ్వి వాయేజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఎంపికైన చిల్ల ఉదయ్ కుమార్, కె. వెంకట శ్రావణి హైదరాబాద్‌లోని జీఏర్ హాలిడేస్ కు ఏంపీక కాబడిన బద్రీ నారాయణ్ అమరియు థామస్ కుక్ (I) లిమిటెడ్‌లో ₹3,50,000 ఆకట్టుకునే వార్షిక ప్యాకేజీతో రెడ్డి భాషిని ఎంపిక కాబడ్డారని వీసీ కట్టిమని తెలిపారు ఆనంతరం టూరిజమ్ డిపార్ట్మెంట్ డీన్ ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా మాట్లాడుతూ ఈ బ్యాచ్ లో రిలీవ్ అయిన 100 శాతం మదికి డిపార్ట్మెంట్ ప్లేస్‌మెంట్ అందించగలిగిందని మొత్తం విద్యార్దులు ఐదు కంపెనీలు రిక్రూట్ చేసుకున్నాయని ఇంటిగ్రెటెడ్ ఎంబిఎ ఇన్ టూరిజం ప్రోగ్రామ్ అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను కలుపుతూ పర్యాటకం మరియు ఆతిథ్య రంగ పరిశ్రమపై విద్యార్థులకు సమగ్ర అవగాహనను అందిస్తుందని తెలిపారు. టూరిజం మరియు హాస్పిటాలిటీ రంగంలో రాణించడానికి నైపుణ్యాలు, విషయ జ్ఞానం వాక్చాతుర్యం ఉంటే మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్, డీన్ ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా మరియు ఇతర అధ్యాపకులు పాల్గొని విద్యార్దులను అభినందించారు. (Story : సిటీయూ టూరిజం గ్రాడ్యుయేట్లలకు ప్లేస్‌మెంట్స్)