అత్యాచార ఘటనపై జనసేన నేత గురాన అయ్యలు దిగ్భ్రాంతి
న్యూస్‌తెలుగు/విజయనగరం:
అభం శుభం తెలియని ఆరునెలల చిన్నారిపై అత్యాచార యత్నం చేసిన సంఘటన పై జనసేన నేత గురాన అయ్యలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ అమానుషమైన సంఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత బాలికకు మరింత మెరుగైన వైద్యం అందించాలని , ఈ ఘటనకు పాల్పడిన నిండితుడిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం అన్యాయానికి గురైన ఆ బిడ్డకు, వారి కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నానని చెప్పారు. (Story : అత్యాచార ఘటనపై జనసేన నేత గురాన అయ్యలు దిగ్భ్రాంతి)