కొత్త కాన్సెప్ట్ తో “సీతారాం సిత్రాలు”
కొత్త కాన్సెప్ట్ తో వస్తోన్న “సీతారాం సిత్రాలు” ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది: దర్శకుడు మారుతి.
రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న చిత్రం సీతారాం సిత్రాలు. లక్ష్మణ్ , భ్రమరాంబిక, కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా డి.నాగ శశిధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
మన పాత రోజులను గుర్తు చేస్తూ… పెళ్లి విసిఆర్ క్యాసెట్స్ పై అల్లిన కథ సీతారాం చిత్రాలు. ఈ చిత్ర కాన్సెప్ట్ ట్రైలర్ ను దర్శకుడు మారుతి విడుదల చేశారు.
ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ…
కొత్త కథ, కథనాలు ఉన్న సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకాదరణ పొందుతాయి. సీతారాం చిత్రాలు టైటిల్, ట్రైలర్, బాగున్నాయి. సినిమా విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నానన్నారు .
షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది.
నటీనటులు: లక్ష్మణ్, భ్రమరాంబిక, కిశోరి దాత్రక్, ఢిల్లీ రాజేశ్వరి, కృష్ణమూర్తి, సందీప్ వారణాశి, గురుస్వామి.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి, కృష్ణ చంద్ర విజయభట్టు
కెమెరామెన్: అరుణ్ కుమార్ పర్వతనేని
మ్యూజిక్: రుద్ర కిరణ్
BGM: శిరీష్ సత్యవోలు
ఎడిటర్: ప్రణీత్ కుమార్
సౌండ్ డిజైన్: సాయి మనిందర్ రెడ్డి
లిరిక్స్: శేఖర్ రాజు విజయభట్టు
రచన, దర్శకత్వం: డి.నాగ శశిధర్ రెడ్డి (Story: కొత్త కాన్సెప్ట్ తో “సీతారాం సిత్రాలు”)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!