టిడిపి చాట్రాయి మండల అధ్యక్షులుగా బొట్టు వరలక్ష్మీ
ఈవి శ్రీనివాస్ (న్యూస్ తెలుగు-చాట్రాయి) : తెలుగుదేశం పార్టీ చాట్రాయి మండల అధ్యక్షురాలుగా బొట్టు వరలక్ష్మిని నియమిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చం నాయుడు నియామక పత్రాన్నివిడుదల చేశారు. సోమవారం రాత్రి కొద్దిసేపటి క్రితం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా దివంగత నేత మండల పార్టీ మాజీ అధ్యక్షులు బొట్టు విజయ్ చౌదరి భార్య టిడిపి ఎన్ఆర్ఐ విభాగం యువనాయకులు బొట్టు వంశీ తల్లి బొట్టు వరలక్ష్మిని నియమిస్తూ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. కరోనా బారిన పడి బొట్టు విజయ్ చౌదరి చనిపోయిన దగ్గర నుండి కొద్దికాలం బొట్టు వరలక్ష్మి మండల పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలు జరగడం లేదని పేరుతో అప్పుడు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షునిగా మరిడి చిట్టిబాబుని నియమించారు. కానీ అప్పట్లో అతనికి నియామక పత్రాన్ని అందజేయలేదు. విజయ్ చౌదరి చనిపోయి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పార్టీ రికార్డులలో ఇప్పటివరకు అధ్యక్షునిగా విజయ్ చౌదరి కొనసాగుతోంది. మండల పార్టీ అధ్యక్ష పదవి మరల బొట్టు వరలక్ష్మికి వస్తుందని కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి నేటితో తెరబడింది. బొట్టు వరలక్ష్మి టిడిపి మండల పార్టీ అధ్యక్షురాలు కావడం వలన కొడుకు బొట్టు వంశీ మండలంలో పార్టీ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడం, వాటిని సమన్వయం చేయడం, యువతరాన్ని ఆకర్షించడం వంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. (Story: టిడిపి చాట్రాయి మండల అధ్యక్షులుగా బొట్టు వరలక్ష్మీ)
See Also
తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే.శ్రీనివాస్‌రెడ్డి
టీడీపీ, జనసేన ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది!
సర్వే సంచలనం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!