UA-35385725-1 UA-35385725-1

ఏలూరు పార్లమెంటు బరిలో కంభంపాటి?

ఏలూరు పార్లమెంటు బరిలో కంభంపాటి?

ఏలూరు (న్యూస్ తెలుగు): తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా కంభంపాటి రామ్మోహన్ రావును ఖరారు చేసినట్లు అనధికారికంగా సమాచారం అందుతోంది. తేదేపా అధిష్టానం ఆయన పేరును పరిశీలించి దాదాపుగా ఖరారు చేసినట్లుగా వినికిడి.

టిడిపితో అనుబంధం…

కంభంపాటి రామ్మోహన్ రావు ఆది నుండి తెలుగుదేశం పార్టీలోనే ఎదిగారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు హయాం నుంచే ఆయన ఎదుగుదల పార్టీలో ప్రారంభం అయ్యింది. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయనను ఎంపిక చేశారు. చంద్రబాబు కూడా తన హయాంలో కంభంపాటికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు. చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే కంభంపాటి రామ్మోహన
రావును ఢిల్లీలో ఏపి ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమించారు. ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు చక్కనిద్దడానికి కంభంపాటిని చంద్రబాబు ఉపయోగించుకున్నారు.

చంద్రబాబుకు నమ్మిన బంటు…

చంద్రబాబుకు నమ్మినబంటుగా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పగలిగే నేతగా, అత్యంత వివాదారహితుడిగా ఉన్న మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు ఈసారి ఏలూరు పార్లమెంటు నుండి బరిలో దింపేందుకు తెలుగుదేశం పార్టీ రంగం సిద్ధం చేసినట్లు వినికిడి. ఆర్థిక, సామాజికపరంగా అధికార పార్టీని ఢీకొట్టాలంటే గట్టి అభ్యర్థిని నియమించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు వినిపిస్తోంది. తెలుగుదేశం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పార్టీకి వీర విధేయుడుగా అధినేత చెప్పిన పని చెప్పినట్లు చేసి పెడతారని కంభంపాటి రామ్మోహన రావుకి మంచి పేరు ఉంది. కష్టకాలంలో ఎంతోమంది పార్టీని వీడినా జగన్ వంటి నేతల బెదిరింపులకు తలొగ్గకక అన్ని విషయాలలో పార్టీని అంటిపెట్టుకొని ఉండటం ఆయనకు అనుకూల అంశాలు. లక్ష్మీ ఆటోమొబైల్స్ పేరిట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వందల సంఖ్యలో బైక్ లు, కార్లు, కార్ల షోరూంలో కలిగి ఉన్న కంభంపాటి రామ్మోహన రావు ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో రానున్న ఎన్నికలలో ఏలూరు నుంచి ఎంపీగా ఆయన పేరు ప్రస్ఫుటంగా వినిపిస్తోంది. ముఖ్యంగా వివాద రహితుడిగా ఉండటం, పార్టీలో అందరితోనూ కలుపుకోలుతనంగా ఉండటం ఆయనకి కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. (Story: ఏలూరు పార్లమెంటు బరిలో కంభంపాటి?)

See Also

మ‌రో ముగ్గురు ఎంపీల జంప్‌!

తెలంగాణ మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్‌గా కే.శ్రీ‌నివాస్‌రెడ్డి

బీజేపీ దారెటు?

‘పుత్రులకు’ ఓటమి ఫీవర్‌!

టీడీపీ, జ‌న‌సేన ఫ‌స్ట్ లిస్ట్ వ‌చ్చేసింది!

సంకోచంలో ‘షర్మిలక్క’

స‌ర్వే సంచ‌ల‌నం : తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా!

కంటతడి పెట్టిన ముద్దరబోయిన!

వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?

వైసిపికి ప్ర‌ముఖ నేత‌లు గుడ్‌బై!

నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌!
UA-35385725-1