శ్రీ చైతన్యలో ఘనంగా ఫ్యామిలీ ఫెస్ట్ ఉత్సవం
విజయనగరం (న్యూస్ తెలుగు) : నేటి తరం విద్యార్థినీ విద్యార్థులకు విద్యతో పాటుగా నైతిక విలువలను, కుటుంబ సాంప్రదాయాలను అలవరిచే విధంగా శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థుల పట్ల, కుటుంబ విలువల పట్ల అధిక శ్రద్ధను తీసుకుంటున్నదని స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో జరిగిన ఫ్యామిలీ ఫెస్ట్ కార్యక్రమంలో పాఠశాల ప్రాంతీయ పర్యవేక్షకులు వి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రిన్సిపాల్ శ్రీధర్ బాబు శ్రీ చైతన్య యాజమాన్యం నిర్వహించే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, గురువు దైవం కంటే ముందుగా తల్లిదండ్రులను ప్రతి విద్యార్థి గౌరవించడం నేర్చుకోవాలని అందులో భాగంగానే వారి పాదాలను కడిగి శిరస్సుపై సంప్రోక్షణ చేసుకొనే విధంగా పెద్దల పట్ల భక్తి, గౌరవములను పెంపొందించుకునేందుకు ఈ మహత్తర కార్యక్రమం ఉపకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులను వారి పిల్లలు కాళ్లు కడిగి గౌరవించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్లు సత్యనారాయణ, సూర్యచంద్ర, సాయి కిషోర్, అప్పలనాయుడు, ఉపాధ్యాయ వర్గం పాల్గొన్నారు. (Story: శ్రీ చైతన్యలో ఘనంగా ఫ్యామిలీ ఫెస్ట్ ఉత్సవం)
See Also:
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!