జావెద్ హబీబ్ బ్రాంచ్‌ని ప్రారంభించిన సిరి సహస్ర
విజయనగరం (న్యూస్ తెలుగు) : విజయనగరం జిల్లా రాజాం మండలంలో జావెద్ హబీబ్ నూతన బ్రాంచ్‌ని ముఖ్యఅతిధిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ & వై.యస్.ఆర్.సి.పి రీజనల్ కో-ఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర(సిరమ్మ) సోమవారం ప్రారంభించారు. రాజాం విచ్చేసిన సిరి సహస్ర (సిరమ్మ)కు స్థానికులు, మహిళలు, అభిమానులు దారి పొడవునా పెద్ద ఎత్తున, స్వాగతం పలికి, బ్రహ్మరథం పట్టారు. అనంతరం వేద పండితుల నడుమ సన్నాయి వాయిద్యాలతో జావెద్ హబీబ్ పార్లర్ ని సిరమ్మ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి , జ్యోతిప్రజ్వలనo చేసి ప్రారంభించారు. అత్యాధునిక పరికరాలతో ఆకర్షణీయమైన వసతులతో చేసిన ఏర్పాట్లను ప్రత్యక్షంగా వీక్షించారు. స్థానిక ప్రజలు ఒక్క సారిగా అభిమానంతో ఫోటోలు,సెల్ఫీలతో పోటీ పడి, ఒక పండగ వాతావరణంలా సిరమ్మకు పుష్పగుచ్చాలు , శాలువాలతో ప్రేమాభిమానాలు చూపారు. వారు చూపించిన ఆదరణలో సిరమ్మ తడిసి ముద్దయ్యారు. సిరమ్మ చేతితోనే ప్రారంభిస్తే అంతా శుభమే జరుగుతుందని జిల్లా ప్రజలకి ఒక నమ్మకం. కాబట్టి జిల్లాలో ఎక్కడ ఏ శుభకార్యక్రమాలు జరిగినా ప్రత్యేకంగా సిరమ్మను ఆహ్వానిస్తుంటారు. (Story: జావెద్ హబీబ్ బ్రాంచ్‌ని ప్రారంభించిన సిరి సహస్ర)
See Also:
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!