కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!
విలీన మండలాల్లో ఆరు మాసాల వ్యవధిలోనే గ్రామాల మునక
భయం గుప్పిట్లో విలీన మండలాలు
సురక్షిత ప్రాంతాలకు పడవల్లో తరలిపోతున్న వరద బాధితులు
చింతూరు : గోదావరికి వరద వచ్చిందంటే వీరికి కష్టాలు ఎదురైనట్లే. గతేడాది వరద నేతలు తీరక ముందే మళ్లీ వరదలొచ్చాయి. గతేడాది 70 అడుగుల మేర గోదావరి వచ్చినప్పుడు కనీసం కన్నెత్తి చూడని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దఫా కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నది. గతంలో ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఉండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ఎటపాక, చింతూరు, వర రామచంద్రాపురం, కూనవరం మండలాల ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. శబరినది వరద పోటెత్తడంతో కూనవరం మండలంలో పదుల సంఖ్యలో గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలైన కొండలు, గుట్టలను వెతుకులాడుకుంటూ వెళ్తున్నారు. గతేడాది దాదాపు వారం రోజుల పాటు వరద నీటిలోనే మగ్గిన దృశ్యాలను తలచుకుని విలపిస్తున్న ప్రజలకు మళ్లీ ఇప్పుడు గోదావరి వరదలు ఆశనిపాతంలా తగిలాయి. మండల కేంద్రమైన కూనవరం దాదాపు ఖాళీ అయింది. శబరి, గోదావరి సంగమ స్థానమైన కూనవరంలో శుక్రవారం గోదావరి 50 అదుగులకు చేరుకోగానే అనేక కాలనీలు నీట మునిగాయి. ప్రజలు ఎడ్లబండ్లలో తమ సామాన్లు వేసుకుని ఇక్కడ సురక్షిత ప్రాంతంగా చెప్పుకునే కోతులగుట్టకు పయనమయ్యారు. అక్కడ డేరాలను ఏర్పాటు చేసుకుని ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కూనవరం రోడ్లపై పడవలు తిరుగుతున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అవగతం చేసుకోవచ్చు. పంటలు వరుసగా రెండేళ్లు దెబ్బతిన్నాయి. మరో పక్క విజరురం మండలం పరిస్థితి దయనీయంగా ఉంది. ఎటు చూసినా వరద బీభత్సం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. విష పురుగుల మధ్య వరద ముంపు ఆందోళన నడుమ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గతేడాది ముంపుకు గురైన సందర్భంలో ఇండ్లను శుభ్రం చేసుకునేందుకు వేలాది రూపాయలు ఖర్చు అయ్యాయి. మళ్లీ ఏటాద్ గడవక ముందే ఈ పరిస్థితి రావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎటపాక మండలంలోని పలు గ్రామాలకు గోదావరి పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక గ్రామాలను గోదావరి వరద చుట్టుముట్టింది. ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించుకునేందుకు సర్వం వదిలేసి జనం పరుగులు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం జాలి చూపించడం లేదు. బాధ్యతలను మరిచి ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇటు పక్క తెలంగాణ ప్రభుత్వం మంత్రులను పంపి వరద బాధితులను పునరావాస కేంద్రాలకు చేరుస్తూ అక్కడ వసతులను కల్పించే పనిలో నిమగ్నమైతే ఆంధ్రా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదన్న వేదన బాధితుల్లో వ్యక్తమవుతుంది. ఎవరో ఒకరు చుమ్మల్ని ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. (Story: కన్నీళ్లు ఆరకముందే… మళ్లీ వరద!)
హీరో నితిన్‌కు ఎక్స్‌ట్రాలు ఎక్కువే!
షూటింగ్‌లో ఉపవాసం చేసిన పవర్‌స్టార్!
మెగాస్టార్ ‘భోళా శంకర్’ ‘మిల్కీ బ్యూటీ’ పాట వచ్చేసింది!
చికెన్ ముక్క కాలుమీదపడి కాలినందుకు రూ.7 కోట్ల నష్టపరిహారం
వివేకా హత్య కేసులో ఆ నివేదికలే కీలకం!
షాకింగ్ న్యూస్: హీరో అబ్బాస్ ఇప్పుడు కారు డ్రైవరా?
బిగ్‌బాస్ సొహైల్‌కు కడుపొచ్చింది!
‘మహావీరుడు’కు రవితేజ వాయిస్ ఓవర్
https://www.youtube.com/@abtimes106