యాదవ సంఘాల ఐక్యవేదిక ర్యాలీ
విజయనగరం (న్యూస్ తెలుగు): స్థానిక ధర్మపురి రోడ్డు వద్ద ఉన్న వైయస్సార్ సిపి జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఇంటి వద్ద యాదవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్మపురి మెయిన్ రోడ్డు నుండి ఇంటి వద్ద వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సాయికిరణ్ యాదవ్ మాట్లాడుతూ యాదవుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని, వెనకబడిన యాదవ కులాన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా విజయనగరం అసెంబ్లీ సీటు, ఒక ఎమ్మెల్సీ యాదవులకి కేటాయించడంతోపాటు అన్ని రాజకీయ పార్టీ నేతలు యాదవులకు సముచిత స్థానం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్, గణేష్ యాదవ్, కిషోర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు. (Story: యాదవ సంఘాల ఐక్యవేదిక ర్యాలీ)
See Also:
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2