సీతంలో ఘనంగా జాతీయ మహిళా దినోత్సవం
విజయనగరం (న్యూస్ తెలుగు) : స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధురాలు, మహిళా చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ప్రత్యేక శ్రీమతి సరోజినీ నాయుడు మహిళల అభివృద్ధిలో భారతీయ సమాజంలో ఉన్న దురాచారాలకు వ్యతిరేకంగా ఆమె పోషించిన కీలక పాత్రకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న ఆమె జన్మదినాన్ని భారత ప్రభుత్వం జాతీయ మహిళా దినోత్సవంగా 2014లో ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు మాట్లాడుతూ మహిళలందరూ సరోజినీ నాయుడు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మీరంతా వృద్ధిలోకి రావాలని కోరారు. ఈ సందర్భంగా మహిళా విద్యార్థులకు, అధ్యాపకులకు వివిధ పోటీలను నిర్వహించి వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి.రామమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story: సీతంలో ఘనంగా జాతీయ మహిళా దినోత్సవం)
See Also:
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2