శ్రీ చైతన్యలో వార్షిక క్రీడోత్సవ వేడుకలు
విజయనగరం (న్యూస్ తెలుగు) : విద్యార్థినీ, విద్యార్థులకు విద్యతో పాటుగా క్రీడలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని క్రీడల ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం దృఢత్వం పొందడమే కాకుండా నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడిని జయించేందుకు, విజయాన్ని సాధించేందుకు కూడా బాల్య దశ నుండే క్రీడల పట్ల విద్యార్థులకు ఆసక్తిని అభివృద్ధిని కలిగించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని స్థానిక టూ టౌన్’ సర్కిల్ ఇన్స్పెక్టర్ కోరాడ రామారావు అన్నారు. మంగళవారం శ్రీ చైతన్య పాఠశాలలో జరిగిన క్రీడా వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల క్రీడలను తిలకించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంతీయ పర్యవేక్షకులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులలో ఉండే నిగూఢమైన క్రీడాశక్తిని పెంపొందించేందుకు ఉత్తమ విద్యతో పాటుగా ఈ క్రీడలను శ్రీ చైతన్య విద్యాసంస్థలు నిర్వహిస్తున్నవని తెలియజేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ వివిధ రకాల క్రీడలను ముఖ్యంగా కోలాటం, పిరమిడ్స్ లాంటి ఎన్నెన్నో క్రీడలను విద్యార్థులకు పోటీగా ఈ క్రీడో త్సవాలలో నిర్వహించడమే కాకుండా ఇందులో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించామని, క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనపరచిన విద్యార్థులకుప్రశంసా పత్రాలను బహుమతులను ముఖ్య అతిధి అందజేశారని తెలియజేశారు. ఈ క్రీడలలో శ్రీ చైతన్యపాఠశాలల జోనల్ వ్యాయామ ఉపాధ్యాయుడు, పి.వాసు, వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాల డీన్లు, సత్యనారాయణ, సాయి కిషోర్, సూర్యచంద్ర, అప్పలనాయుడు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయ వర్గం పాల్గొన్నారు. (Story: శ్రీ చైతన్యలో వార్షిక క్రీడోత్సవ వేడుకలు)
See Also:
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2