UA-35385725-1 UA-35385725-1

ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్‌ యుద్ధం

ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్‌ యుద్ధం

Pak War against Afghan : రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ తన ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆఫ్ఘనిస్థాన్‌పై యుద్ధం ప్రకటించింది. ఓవైపు ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య యుద్ధం దాదాపు 50 రోజులుగా కొనసాగుతుండగా, మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్‌ బాంబులు వేసి విరుచుకుపడుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా పాక్‌ తన సరిహద్దుల్లోని అఫ్గాన్‌ గ్రామాలపై రాకెట్‌ దాడులకు పూనుకుంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ ఐదుగురు చిన్నారులు, ఓ మహిళ మృతి చెందినట్టు తెలిసింది. సరిహద్దు ఘర్షణల ఫలితంగా జరిగిన యుద్ధమా లేక పాక్‌ పూర్తిస్థాయి వార్‌ ప్రకటించిందా అన్నది ఇంకా తెలియరాలేదు. ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య డ్యూరాండ్‌ రేఖగా పిలుచుకునే సరిహద్దు 2,700 కిలోమీటర్ల పొడవునా వుంటుంది. సరిహద్దుకు సంబంధించి ఈ రెండు దేశాల మధ్య ఎల్లప్పుడూ గొడవలు మామూలే. ఆఫ్ఘన్‌ నుంచి అమెరికా సేనలు ఉపసంహరించుకున్న తర్వాత ఆ దేశాన్ని తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. అమెరికన్ల ఆధిపత్యంలో వున్నన్నాళ్లూ పాక్‌ పెద్దగా నోరుమెదపలేదు. ఇప్పుడు తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్థానే తమపై దాడి చేయడానికి ప్లాన్‌ చేస్తున్నదని పదేపదే పాక్‌ నేతలు హెచ్చరిస్తూ వున్నారు. తాలిబాన్లు దాడికి పూనుకోకముందే తామే బాంబుల వర్షం కురిపించడం ఉత్తమమని భావించిన పాక్‌ తెలవారుజామునే రాకెట్ల వాన కురిపించింది. ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్‌ వరుస రాకెట్‌ దాడులు చేపట్టింది. ఆఫ్ఘన్‌లోని కునార్‌ ప్రాంతంలో షెల్టాన్‌ జిల్లాలో పాకిస్థాన్‌ రాకెట్‌ దాడులు ప్రయోగించింది. ఇక్కడే కాకుండా సరిహద్దు ఖోస్ట్‌ ప్రావిన్స్‌లోనూ పాక్‌ రాకెట్‌ దాడులు చేసినట్టు తాలిబాన్‌ అధికారులు చెబుతున్నారు. ఖోస్ట్‌ ప్రావిన్స్‌లోని నాలుగు గ్రామాలపై పాకిస్థాన్‌ హెలికాప్టర్లు బాంబులు విసిరాయని చెబుతున్నారు. ఈ దాడులను ఆఫ్ఘన్‌ విదేశాంగ శాఖ సీరియస్‌గా తీసుకుంది. కాబుల్‌లోని పాకిస్థాన్‌ రాయబారిని పిలిపించి, సంజాయిషీ అడిగింది. తమ నిరసనను కూడా తెలియజేసింది. ఇదే కొనసాగితే, తాము కూడా ఎదురుదెబ్బ తీయాల్సి వుంటుందని తాలిబాన్లు హెచ్చరించారు. పాక్‌ దాడుల్లో తమ దేశ పౌరులు చనిపోతున్నారని తాలిబాన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడుల గురించి అమెరికా గానీ, ఐక్యరాజ్యసమితి గానీ ఇంతవరకు స్పందించలేదు. (Story: ఆఫ్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్‌ యుద్ధం)

See Also: 

హిజ్రాలతో లేడీ ఖైదీల సెక్స్‌ : ఇద్దరికి ప్రెగ్నెన్సీ!

నగ్నంగా డ్యాన్స్‌లు.. 10 మంది అరెస్ట్‌

రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా ఉండటం చూసి…3 ఏళ్ల బాబు కళ్లముందే…?

ఆ నటి పోర్న్‌స్టార్‌గా ఎందుకు మారింది?

వేసవి సెలవుల తేదీలు మారాయి!

అమ్మఒడికి ఆంక్షలు…పూర్తి వివరాలివే! అప్లయ్‌ చేసుకునే విధానం!

కేసీఆర్‌ నిర్ణయంతో ఆంధ్రోళ్లకు కోట్లుకోట్లు

కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2 అసలు సిసలు సమీక్ష ఇదే!

కలెక్టర్‌గారి అరాచకం! తెలంగాణలో విచిత్రం!

ఎన్‌టీఆర్‌, చరణ్‌లలో డామినేషన్‌ ఎవరిది? క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

తూచ్‌! రాజీనామా లేఖకాదు…థ్యాంక్స్‌ లేఖ!

విజయ్‌ ‘బీస్ట్‌’ మూవీ పెర్‌ఫెక్ట్‌ రివ్యూ!

మందు తాగుతా… కథలు రాస్తా!

ఇకపై హైదరాబాద్‌ శివారు భూములు బంగారమే!

పసిపాపను చితకబాదిన తల్లి : వీడియో వైరల్‌

పింఛ‌ను డ‌బ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!

చ‌నిపోయాడ‌ని పూడిస్తే…బ‌తికొచ్చాడు!

స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : క‌ట‌క‌టాల్లో టీచ‌ర్‌

ఏపీలో పంచాయతీ నిధులన్నీ మాయం!

ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1