AP EAPCET 2022 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుల ప్రక్రియ షురూ!
AP EAPCET 2022: ఆంధ్రా ఎంసెట్‌కు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఏపీ ఈఏపీసెట్ 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2022-23 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఈ రోజు (ఏప్రిల్ 11) నుంచి మే 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్ స్ట్రీమ్‌లో 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులెవరైనా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ రెండో ఏడాది పరీక్షలకు హాజరుకావాల్సిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష జులై 4 నుంచి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. ఏపీ ఈఏపీసెట్ ద్వారా బీఈ, బీటెక్, బీటెక్ (బయోటెక్), బీటెక్ (డైరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీఫార్మసీ, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ, ఏహెచ్, బీఎఫ్‌ఎస్సీ, Pharm-D కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అయితే, ఈ ఏడాది ఇంటర్ వెయిటేజీ తొలగిస్తారు. వెయిటేజీ తొలగిస్తే 100 శాతం మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయిస్తారు. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://sche.ap.gov.in/APSCHEHome.aspx ను లాగిన్ కావచ్చు. (Story: AP EAPCET 2022 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుల ప్రక్రియ షురూ!)
See Also:
ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకారం హైలైట్స్!
బాలినేనికి మంత్రిపదవి దక్కకపోవడానికి కారణాలివేనా?
ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు వీరే! (Full Details)
మీడియాపై మంత్రి పేర్ని నాని ఉద్వేగపూరిత వ్యాఖ్యలు
మంత్రుల పేషీల్లోని అధికారులకు షాక్..!
పింఛను డబ్బులు, ప్రియురాలు : గోవిందా గోవింద!
చనిపోయాడని పూడిస్తే…బతికొచ్చాడు!
రామ్‌గోపాల్‌వర్మకు ధియేటర్ల షాక్!
స్టూడెంట్స్‌తో గ్రూప్‌సెక్స్ : కటకటాల్లో టీచర్
రామ్‌చరణ్‌తో బిగ్ డీల్ నిజమేనా?
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!
వావ్! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!