ఎమ్మెల్యేతో మేయర్ పెళ్లి
తిరువనంతపురం : సీపీఎం ఎమ్మెల్యే, సీపీఎం మేయర్…వీళ్లద్దరూ వివాహం చేసుకొని ఒక్కటి కాబోతున్నారు. కేరళలో ఈ పెళ్లి జరగబోతున్నది. ప్రస్తుతం కేరళలో వామపక్ష ప్రభుత్వం అధికారంలో వున్న విషయం తెల్సిందే. ఈ యువ నేతలిద్దరూ మొదట్నించీ సీపీఎం, దాని అనుబంధ సంఘాల్లో మంచి కార్యకర్తలుగా పనిచేశారు. ఆమె దేశ ప్రజలను తన వైపు ఆకర్షించి చిన్న వయసులోనే మేయర్ పీఠాన్ని అధిరోహించారు.. ఆయన రాష్ట్ర అసెంబ్లీలో అతి తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యేందకు సిద్దమయ్యారు. ఈ విషయం కేరళలో ఆసక్తికరంగా మారింది. వారిద్దరూ ఎవరంటే.. తిరువనంతపురం మేయర్ ఆర్యా రాజేంద్రన్, బలుస్సెరీ ఎమ్మెల్యే సచిన్ దేవ్. విద్యాభ్యాసం తర్వాత బాలసంఘం, ఎస్‌ఎఫ్‌ఐలో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిరది. అనంతరం వీరు మంచి స్నేహితులయ్యారు. కాగా, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సెక్రటరీగా ఉన్న సమయంలో సచిన్ దేవ్‌కు 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార సీపీఎం పార్టీ అవకాశం ఇచ్చింది. దీంతో, ఎన్నికల్లో బలుస్సెరీ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటుడు ధర్మజన్ బోల్గట్టిపై పోటీ చేసి విజయం సాధించారు. దీంతో కేరళలో అతిచిన్న వయస్సుల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మరోవైపు.. తిరువనంతపురం మేయర్ అభ్యర్థిగా ఆర్యా రాజేంద్రన్ సీపీఎం పార్టీ తరఫున పోటీ చేశారు. సీనియర్ అభ్యుర్థులకు షాకిస్తూ ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించారు. ఈ క్రమంలోనే 21 ఏళ్ల వయసులో ఈ పదవికి ఎన్నికై దేశం దృష్టిని తన వైపునకు తిప్పుకున్నారు. ఇదిలా ఉండగా.. వీరిద్దరి మధ్య స్నేహ బంధం కాస్తా.. త?్వరలో వివాహం బంధం కానుంది. వీరికి పెళ్లికి రెండు కుటుంబాల సభ్యులు అంగీకరించినట్టు సచిన్ దేవ్ ధ్రువీకరించారు. పెళ్లి తేదీ ఫిక్స్ కాగానే ఒకటవుతామని ఆయనన్నారు. (Story : ఎమ్మెల్యేతో మేయర్ పెళ్లి)
See Also : వర్క్ ఫ్రమ్ హోమ్‌కు బైబై