పిల్లలకు వ్యాక్సిన్ ఓకేనా?
శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తే తప్ప 5-15 ఏళ్లలోపు పిల్లలకు టీకా వద్దంటున్న కేంద్ర మంత్రి
న్యూదిల్లీ : పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌పై ఇంకా గందరగోళం కొనసాగుతోంది. శాస్త్రవేత్తలు చెపితే తప్ప దానిపై ముందడుగు వేయలేమని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది. దేశంలో కోవిడ్ వాక్సినేషన్ జోరుగా సాగుతున్నప్పటికీ, 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు పిల్లలకు వ్యాక్సినేషన్ విషయంలో శాస్త్రవేత్తలు చేసే సిఫార్సుల ఆధారంగా నిర్ణయిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఈ వయస్సు వారికి వ్యాక్సినేషన్‌పై నిపుణులు ఇప్పటివరకు ఎటువంటి సిఫార్సులు చేయలేదని మంత్రి గుర్తుచేశారు. శాస్త్రవేత్తల సంఘం చేసే సిఫార్సుల ఆధారంగా ఏ వయస్సు వారికి ఎప్పుడు వ్యాక్సిన్ ఇవ్వాలన్నది నిర్ణయిస్తామని, వారంలోగా ప్రికాషన్ గ్రూపు కోసం సిఫార్సులు అమలు చేస్తామని తెలిపారు. సిఫార్సులు వచ్చాక 5`15 ఏళ్ల వారికి టీకాలు ఇస్తామన్నారు. 15`18 మధ్య వయస్సు వారికి గతనెలలో కోవిడ్ వ్యాక్సినేషన్ మొదలైంది. వ్యాక్సినేషన్ సమస్య లేదని, సరిపడ టీకాలు అందుబాటులో ఉన్నాయని మాండవియా చెప్పారు. 5-15 ఏళ్ల పిల్లలపై వ్యాక్సిన్ ప్రభావంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని, వారి సిఫార్సుల మేరకే టీకాలు అందజేస్తామన్నారు. మూడవ దశలో వైరస్ కట్టడికి వాక్సిన్‌లను భారత్ సమర్థంగా వినియోగించుకుందని తెలిపారు. ఇప్పటివరకు 96శాతం మంది మొదటి టీకా పొందగా 77 శాతం మంది రెండు టీకాలు పొందారని, 15`18 వయస్సు వారిలో 75 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్రం లెఖ్కలు చెపుతోంది.(Story: పిల్లలకు వ్యాక్సిన్ ఓకేనా?)
See Also: కరోనా తగ్గుముఖం