రానున్న రెండు మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : గనపాక సుధాకర్
న్యూస్ తెలుగు /ములుగు : రాష్ట్రములో రానున్న రెండు, మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు ఉన్నాయని,వాతావరణ శాఖ సూచించిందని, కావున ప్రజలువరద పరివాహక ప్రాంతాలలో నివాసం ఉంటున్న ఇండ్లలోని వృద్ధులు, పిల్లలు, మహిళలు బయటకువెళ్లకుండ తాగుజగ్రత్తలు తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా, జిల్లా కార్యదర్శి గనపాక సుధాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి సుధాకర్ మాట్లాడు
ప్రజలు అవసరమైతే తప్ప, బయటకు వెళ్ళకూడదని,
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాలవద్ద ఉండాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గనపాక సుధాకర్ వారిని కోరారు.ఈరోజు
గోవిందరావుపేట మండలం, చల్వాయి గ్రామంలోబుధవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలసి వివిధ వార్డుల లో తిరుగుతూ ప్రజల యొక్క యోగ క్షేమలు అడిగి తెలుసుకుంటూ,
భారీ వర్షాలకు కూలిన ఇండ్లు, అధిక వరదల వల్ల కుట్టుకుపోయిన పంటలకు ప్రభుత్వం అధికారులతో అంచనా వేసి నష్టపరిహారం అందచేస్తుందని, అన్నారు.
ఎవరు కూడా అదైర్యాపడకూడదు, మీకు ప్రభుత్వం అండదండలు ఉంటాయని l అన్నారు.వివిధ స్వచ్చంద సంస్థలు, ఎన్ ఆర్ ఐ లు సీఎం సహాయ నిధికీ, విరాళాలు అందించి,అపదలో ఉన్న వారిని ఆదు కోవాలని కోరారు.
ఈకార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు వేల్పుకొండ ప్రకాష్, జిల్లా బిసి సెల్ ప్రధాన కార్యదర్శి కాసార్ల రాంబాబు, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు పెద్దాపురం మొగిలి, మాజీ ఎంపీటీసీ బోనగాని సారయ్య గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు కందాల వెంకన్న, సీనియర్ నాయకులు వచ్చావాయి సారయ్య గౌడ్, యూత్ సీనియర్ నాయకులు గుండె రమేష్, జక్కీ వికాస్ రాజ్, గింజపెల్లి వీర రాఘవులు తదితరులు పాల్గొన్నారు. (Story : రానున్న రెండు మూడు రోజుల్లో అతి భారీ వర్షాలు)