గిరిజన ప్రాథమిక పాఠశాల పునః ప్రారంభించిన మంత్రి సీతక్క.
న్యూస్ తెలుగు :కన్నాయి గూడెం / ములుగు :
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం లోని గిరిజన ప్రాథమిక పాఠశాలను శుక్రవారం, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటి డి ఏ పి. ఓ చిత్ర మిశ్రా లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తుపాకులగూడెం లోని గిరిజన ప్రాథమిక పాఠశాల 2001-2002 వరకు నడిచిందని, అప్పుడు పని చేసిన ఉపాధ్యాయులు బదిలీల్లో వెళ్ళిపోతే అప్పటి నుంచి స్కూల్ క్లోజ్ చేయబడినదని తెలిపారు. ఇక్కడి పిల్లలు పక్కనే ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతునందున గ్రామస్తులు మా గ్రామంలో పాఠశాల కావాలని కోరారని, అందుకే పక్కనే ఉన్న టి డబ్ల్యూ యు పి ఎస్ స్కూల్ నుండి ఇద్దరు ఉపాధ్యాయులను నియమించి పాఠశాల కొనసాగిస్తున్నమని మంత్రి తెలిపారు. పాఠశాల భవనం నకు పెయింటింగ్ వేయించాలని, కిటికీలకు మెష్ ఏర్పాటు చేయించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశించారు.
అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. నూతనంగా టాయిలెట్ కట్టించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ కె. సత్య పాల్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి, తహసిల్దార్, ఎం. ఈ. ఓ., తదితరులు పాల్గొన్నారు.