తక్కల్లపల్లి శ్రీనివాసరావు ను ఘనంగా సన్మానించిన నేదునూరి రాజమౌళి.
న్యూస్ తెలుగు :వరంగల్ / ములుగు :
దేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్వహిస్తున్న,ప్రజా పోరాటాలకు ఆకర్షితులైన తక్కల్లపల్లి శ్రీనివాసరావు, కర్ణాటక రాష్ట్ర విద్యార్థి సంఘం కార్యదర్శిగా, పనిచేస్తూ, క్రియాశీలకంగా ఉద్యమాన్ని నిర్మిస్తున్న సందర్భంలో సిపిఐ జాతీయ పార్టీ ఢిల్లీ పిలుపునందుకొని,అఖిల భారత విద్యార్థి సమైక్య జాతీయ కార్యదర్శిగా,ఢిల్లీ కేంద్రంగా పనిచేసే విద్యార్థి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేయడం జరిగిందని,బి సి హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు నేదునూరి రాజా మౌళి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా రాజమౌళి మాట్లాడుతూ ఈ నేపథ్యంలోనే జన్మస్థలమైన,వరంగల్ సిపిఐ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ,పార్టీని నిర్మాణ పరంగా నిర్మిస్తూ,నివాస స్థలాల పోరాటాలతో ప్రజల పార్టీగా నిర్మించడం గుర్తించిన తెలంగాణ రాష్ట్ర సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, ఇటీవల హన్మకొండ హరిత హోటల్లో జరిగిన సమావేశాలలో ఎన్నుకోవడం జరిగినదని తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు ను శాలువా, బొక్కే తో సన్మానం చేశామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నవచేతన బుక్ హౌస్ మేనేజర్ ఎర్ర నాగరాజు ఏఐటీయూసీ నాయకులు ఎర్ర కుమారస్వామి, ఎండి ఉస్మాన్ భాష, హెర్బల్ ప్రతినిధి వెంకటేష్ బుక్ హౌస్ సేల్స్ మేనేజర్ రమేష్ పాల్గొన్నారు