మావోయిస్టుల ఏరివేతకు ట్రాన్స్ జెండర్స్
– బస్టర్ ఫైటర్స్ లో 9 మంది రిక్రూట్
– యుద్ధ తంత్రాలు నేర్పుతున్న పోలీసులు
న్యూస్‌తెలుగు/భద్రాచలం : అరచేతితో చప్పట్లే కాదు ఆ అరచెతులనే వడసిపట్టి తుటాలను సైతం కురిపిస్తామంటూ ట్రాన్స్ జెండర్స్ పోలీస్ శాఖలో చేరుతున్నారు. దేశంలో ప్రధమంగా ఛత్తీస్ గఢ్ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడిచే బస్తర్ ఫైటర్స్ విభాగంలో ట్రాన్స్ జెండర్స్ రిక్రూట్ అయ్యారు. లింగ వివక్షను రూపుమాపేందుకు చేసిన తొలి ప్రయత్నానికి ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
9 మంది ఎంపిక ///- మొత్తం బస్తర్ ఫైటర్స్కు 608 మంది ఎంపిక కాగా వారిలో 9 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. వీరిలో అత్య మావోయిస్టు ప్రభావిత జిల్లా అయిన
కాంకేర్ జిల్లా వారు 8 మంది ఉండగా, ఒక్కరు మాత్రం బస్తర్ జిల్లా వాసి. ఇదిలా ఉండగా వీరు మావోయిస్టుల పై యుద్ధానికి దిగే బస్తర్ ఫైటర్స్ విభాగంలో విధులు నిర్వహించనున్నారు. బస్తర్ డివిజన్ లోని బస్తర్, దంతెవాడ, బీజాపూర్, నారాయణపూర్, సుకుమా, కాంకేర్, కొండగావ్ ఏడు జిల్లాల నుండి ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేసేందుకు 53,336 దరఖాస్తులు అందగా, ఇందులో 16 మంది ట్రాన్స్ జెండర్లు దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. వీరితో పాటు 37498 మంది పురుషులు, 15822 మంది మహిళలు ఉన్నారు. 16 మంది ట్రాన్స్ జెండర్లలో 9 మంది కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. వీరికి రాయ్ పూర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2020 నుండి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పోలీసులు – స్థానిక గిరిజనుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు స్థానికంగా ఉండే గిరిజనులను చేర్చుకుంటోంది. బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభాల్యం అంధికంగా ఉంది. వారికి అడ్డుకట్ట వేయాలంటే ఆ ప్రాంతంపై పూర్తి అవగాహన గల వారితో పాటు భాష, మాండలికం, భౌగోళిక స్వరూపాలపై పట్టున్న వారు
చాలా అవసరం. ఏడు జిల్లాలకు చెందిన ట్రాన్స్ జెండర్స్ ను తీసుకుని వారికి యుద్ధతంత్రాలు పూర్తిగా నేర్పి మావోయిస్టుల కట్టడికి అడవిబాట పట్టించేందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. (Story : మావోయిస్టుల ఏరివేతకు ట్రాన్స్ జెండర్స్ )