నేటి నుంచి నగరంలో సూత్ర ఎగ్జిబిషన్
న్యూస్‌తెలుగు/ విజయవాడ :
ప్రముఖ ఫ్యాషన్ ప్రియుల ఎగ్జిబిషన్ సూత్రా నగరంలో సోమ, మంగళవారాలలో ప్రదర్శన మరియు అమ్మకాలు నిర్వహించనున్నట్టు సూత్ర ప్రతినిధి ఉమేష్ తెలిపారు.
ఈసారి సూత్రా రాఖీ తేజ్ కొరకు దేశం నలుమూలల నుండి విశిష్టమైన డిజైనర్స్ ను విజయవాడ తీసుకువస్తుందన్నారు. ఈ ఎగ్జిబిషన్ జూలై 15 నుండి జూలై 16 వ తేదీ వరకు రెండు రోజుల పాటు నగరంలోని శ్రీ శేషసాయి కళ్యాణ వేదిక లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు.
సూత్రా ఎగ్జిబిషన్ నందు వేలాది రకాల దుస్తులు, ఆభరణాలు, సౌందర్య సాధనాలు, గృహ అలంకరణ సామగ్రి, గిఫ్ట్ వస్తువులు, ఉపకరణాలు మొదలనవి ప్రదర్శిస్తామన్నారు. రాబోయే రాఖీ & తీజ్ సీజన్ కోసం ప్రత్యేక ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకు వచ్చామని, ఎగ్జిబిషన్ కి ప్రవేశం ఉచితమన్నారు.
యూబీ ట్రెండ్జ్, తపస్వి డిజైనర్, లక్నోవి కుర్తీస్ & ప్లాజో, కలర్స్ ఫ్యాట్, విమ దిలీప్, ధాత్రే డిజైనర్లు, ఎకోలక్స్ ల్యాబ్ గ్రోస్ డైమండ్ జ్యువెలరీ, ఆక్సికా జ్యువెల్స్, పైన్ బోటిక్, లక్ష్మి హోమ్ ఫ్యాబ్రిక్స్, షాజ్ కలెక్షన్, హెర్సాఖి ఆభరణాలు, పండోర ఆర్ట్ జ్యువెలరీ, కష్వీ చేనేత, మహిళల ఫ్యాషన్, టప్పర్వేర్
తదితర సంస్థలు పాల్గొంటాయి అన్నారు.
ముంబాయి, ఢిల్లీ, కోల్ కతా, నాగపూర్, రాయపూర్, బనారస్, ఉజ్జయిని, భోపాల్, గోవా, బెంగుళూరు మొదలైన నగరాల నుండి సేకరించిన లైఫ్ స్టయిల్ బ్రాండ్లు ఈ ప్రదర్శనలో అందిస్తున్నట్లు తెలిపారు.