సిఎం సహాయ నిధికి రూ.2.47లక్షల విరాళం
న్యూస్‌తెలుగు/ విజయనగరం : రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకొనేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2,47,435 విరాళాన్ని ఎంఎల్ఏ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అందించారు. దీనికి సంబంధించిన చెక్కును రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతులమీదుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌కు శనివారం ఆయన ఛాంబర్లో అందజేశారు. ఈ మొత్తంలో అద్దేపల్లి విజయలక్ష్మి రూ.10,000, హెల్‌సేల్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ రూ.1,00,000, విజయనగరం పట్టణంలోని 1వ వార్డు అయ్యప్పనగర్ చిన్నారులు రూ.5,312, 5వ వార్డులోని మహిళా కార్యకర్తలు రూ.32,000, నేతాజీ ఎక్స్ సర్వీస్‌మెన్ అసోసియేషన్ రూ.1,00,123 సమకూర్చినట్లు ఎంఎల్ఏ అదితి విజయలక్ష్మి తెలిపారు. (Story : సిఎం సహాయ నిధికి రూ.2.47లక్షల విరాళం)