తెలంగాణా పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : ములుగు జిల్లాలోని ఆడపడుచులకు, ఆడబిడ్డలకు, పోలీస్ ఆడ బిడ్డలకు,తెలంగాణా పూల బతుకమ్మ పండుగ సందర్బంగా ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ
తెలంగాణ ఆచార, సంప్రదాయాలకు ప్రతీక మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక, బతుకమ్మ పండుగ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పూల బతుకమ్మ పండుగాను ఘనంగా నిర్వహించారు.మహిళ పోలీస్ ఆడబిడ్డలందరూ ఆడి పాడి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.మరోసారి జిల్లా పోలీస్ అడ్డ బిడ్డలకు పూల బతుకమ్మ పండుగా శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ తెలిపారు. (Story: తెలంగాణా పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు)