ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి కి పీసా కమిటీ లు కృషి చేయాలి
ఏపిఓ. జనరల్ కనక భీమ్ రావు
న్యూస్ తెలుగు /ములుగు : భారత రాజ్యాంగం 5 వ షెడ్యూల్ లోని ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి కి పీసా కమిటీ లు కృషి చేయాలనీ ఏటూరునాగారం ఐటిడిఏ ఏపిఓ జనరల్ కనక భీమ్ రావు కోరారు. సోమవారం ఐటిడిఏ సమావేశఫు మందిరం లో పీసా జిల్లా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా,ముఖ్య అతిధిగా ఏపిఓ హాజరై మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన సంప్రదాయాల బద్దంగా, గ్రామ సభలు నిర్వహించుకొనే అధికారం, పీసా కమిటీ లకు ఉందన్నారు. గ్రామ సభ తీర్మాణాలను అమలు చేసే భాద్యత, 29 ప్రభుత్వ శాఖల అధికారులకు ఉందన్నారు. కుల ఆచార సంప్రదాయాలను, హక్కులను, చట్టాలను, రక్షించుకునే అవకాశం పీసా గ్రామ సభలకు ఉందన్నారు. పిఓ ఉత్తర్వులును అనుసరించి, ఏజెన్సీ లో అధికారులు పనిచేయాలన్నారు. అందరు కలిసి కట్టుగా పనిచేసి, గిరిజన గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చి దిద్దాలన్నారు. ఈ కార్యక్రమం లో ఆర్ ఓ ఎఫ్ ఆర్ డి టి వెంకన్న, పీసా కమిటీ ములుగు జిల్లా అధ్యక్షులు డబ్బుల ముత్యాల రావు, కార్యదర్శి వజ్జ రాజు, జిల్లా కమిటీ సభ్యులు, మండల భాద్యులు ఇర్ప రాజు, ఇండ్ల సమ్మయ్య, జోగ నరేంద్ర, పాయం రాకేష్, ఆలం రవి, అల్లేమ్ నవీన్, రంజిత్ కుమార్, 112 గ్రామ పంచాయతీ ల మొబిలైజర్లు పాల్గొన్నారు. (Story : ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి కి పీసా కమిటీ లు కృషి)