సనాతన ధర్మ పరిరక్షణకు ఐక్యంగా కదులుదాం
న్యూస్ తెలుగు/విజయనగరం : సనాతన ధర్మ పరిరక్షణకు ఐక్యంగా కదులుదామని జనసేన నాయకులు గురాన అయ్యలు, అవనాపు విక్రమ్ , మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కాళ్ళ గౌరీశంకర్ పిలుపునిచ్చారు.పవన్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మంగళవారం మన్నార్ శ్రీ రాజగోపాలస్వామి ఆలయం లో ‘ఓం నమో నారాయణాయ’ మంత్ర పఠనం చేసి 108 కొబ్బరికాయలు కొట్టారు .”ప్రజల కోసం పవనుడు” పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గురాన అయ్యలు , అవనాపు విక్రమ్, కాళ్ల గౌరీ శంకర్ లు మాట్లాడుతూ పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందన్నారు. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరని దుయ్యబట్టారు. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్న నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనని అన్నారు.దేవదేవుని పట్ల గత పాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటున్నట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు, ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవడం, కనిపెట్టినా నోరు మెదపలేదంటే నాటి రాక్షస పాలకులకు భయపడి మౌనంగా ఉన్నారని అనిపిస్తోందన్నారు.వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు, వేదాచారాలకు, ధార్మిక విధులకు కళంకం తెచ్చే విధంగా పెడపోకడలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరినీ బాధించిందని తెలిపారు. ఇప్పుడు ధర్మాన్ని పునరుద్ధరించుకొనే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైందని అన్నారు.పి.రవింద్ర, పిడుగు సతీష్, కాటం అశ్విని, దుప్పాడ జ్యోతి, , పిడుగురాజ్యలక్ష్మీ, కవిత, చిట్టిరాజు, మోహన్ రావు, తోటనాయుడు, దుప్పడనరేష్, సాయికిరణ్ , రమణ,బాబూరావు, చందు,ప్రసాద్, ఎమ్.పవన్ కుమార్, నాని, వెంకటరావు, గురజాపువెంకటేష్, అభి,ఖాదర్ షా ,త్రినాథ్, మారిష్, సల్మాన్, పవన్, బాలకృష్ణ , బన్నీ, సురేష్, దిలీప్, వెంకీ, కంది సురేష్, రాంబాబు, అశోక్, స్వామి, అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.(Story:సనాతన ధర్మ పరిరక్షణకు ఐక్యంగా కదులుదాం)