సైబర్ మోసాలను అడ్డుకోవాలి
బాధిత వ్యక్తులకు సత్వర న్యాయం చేయాలి
ములుగు జిల్లా బ్యాంకింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఓ ఎస్ డి మహేష్ బి.గితే
న్యూస్ తెలుగు /ములుగు : రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల దృశ్య తమ బ్యాంకులకు విచ్చేయు ఖాతాదారులకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించాలని, ములుగు జిల్లా ఓ ఎస్ డి మహేష్ బాబా గితే అన్నారు. శుక్రవారం ములుగుజిల్లా ఓ ఎస్ డి కార్యాలయంలో బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించి ఓ ఎస్ డి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితిలో తమ వ్యక్తిగత ఖాతా వివరాలను ఎవరికి అందించకుండా తగు సూచనలు ఇవ్వాలని, అసంబంధిత లింకులను ఓపెన్ చేయరాదని,తమ బ్యాంకులలో సైబర్ నేరాల పట్ల గల సూచనలను గోడప్రతుల ద్వారా ఖాతాదారులకు తెలియజేయాలని బ్యాంకింగ్ అధికారులను కొరారు.
ఈ సమావేశంలో జిల్లా ఓఎస్డి మాట్లాడుతూ ఖాతాదారులు సైబర్ మోసాల వల్ల నగదును కోల్పోయి,బ్యాంకు వద్దకు వస్తే, 1930 ద్వారా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయాల్సిందిగా తెలియజేయాలన్నారు. ఎఫ్ ఐ ఆర్ అనంతరం పోలీస్ వారి సూచన మేరకు,సంబంధిత ఖాతాలను సీజ్ చేయాలని, ఏదైనా ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు జమ చేసిన, పెద్ద మొత్తంలో నగదును విడిపించిన, లేదా అనుమానిత ఖాతాల వివరాలు తెలిసినా వెంటనే పోలీస్ వారికి అందించాలని తెలిపారు.తద్వారా బాధిత వ్యక్తులకు న్యాయం చేకూర్చగలుగుతామని, ఖాతాదారులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను, ఎట్టి పరిస్థితుల్లో బయట వ్యక్తులకు ఇవ్వరాదన్నారు. సైబర్ కేటుగాళ్ల ద్వారా ఎవరు మోసపోకుండా చేస్తున్న ప్రయత్నంలో పోలీస్ వారికి సహకరించగలరని ఓఎస్డి బ్యాంకింగ్ అధికారులను కోరారు.ఈ సమావేశంలో సైబర్ క్రైమ్ డిఎస్పి సందీప్ రెడ్డి, ములుగు డిఎస్పి రవీందర్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ యాసిన్, బ్యాంకింగ్ అధికారులు పాల్గొన్నారు. (Story : సైబర్ మోసాలను అడ్డుకోవాలి )