వినకొండ రైతుల వద్దకు రెవెన్యూ వ్యవస్థ
న్యూస్ తెలుగు/వినుకొండ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల వద్దకు రెవెన్యూ వ్యవస్థను తీసుకెళ్ళి వారికి వ్యవసాయ భూముల సమస్యలను పరిష్కరించెందుకు చేపట్టిన రెవెన్యూ సదస్సు లలో భాగంగా శుక్రవారం వినుకొండ మండలం గోకనకొండ గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగింది. రెవెన్యూ సదస్సులో మండల స్పెషల్ అధికారి శ్రీరాములు, తహసిల్దార్ సురేష్ మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సదరు సదస్సులో 25 అర్జీలు వచ్చాయి.(Story : వినకొండ రైతుల వద్దకు రెవెన్యూ వ్యవస్థ )