ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగమే..!
న్యూస్ తెలుగు సాలూరు : అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో అమలు అవ్వడం లేదని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర అన్నారు శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలో గల 24 వార్డులో ఉన్న బంగారమ్మ పేట లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన ప్రజలందరూ సంతోషం గా వున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగము అమ్మలు అవ్వడం లేదని దళిత ప్రజాప్రతినిధులపై అధికారులపై అక్రమ కేసులు బనాయించి రెడ్ బుక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. అంబేద్కర్ వలన బడుగు బలహీన వర్గాల వారికి రిజర్వేషన్లు ఉండటం వల్ల రాజకీయాల్లో ఉద్యోగాల్లో అవకాశాలు ఉండడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు జేఏసీ కన్వీనర్ గిరి రఘు 24 వార్డు కౌన్సిలర్ సింగరపు ఈశ్వరరావు తీగల బలరాం ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.(Story : ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగమే..! )