లాభాల బాటలో ఆర్టీసీ
న్యూస్ తెలుగు/వనపర్తి : గత ప్రభుత్వ పాలనలో అంతంత మాత్రమ ఆదాయంతో అవస్థలు ఎదుర్కొన్న ఆర్టీసీ నేడు నేడు కోట్ల రూపాయల ఆదాయంతో ముందుకు దూసుకుపోతుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వనపర్తి ఆర్టీసీ బస్టాండ్ లో నిర్వహించిన విజయోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఆర్టీసీ ఆస్తులను తెగ నమ్మి సొమ్ము చేసుకున్నారు తప్ప ఆర్టీసీ బలోపేతానికి ఏమాత్రం కృషి చేయలేదని ఎమ్మెల్యే విమర్శించారు. తమ కష్టాలు చెప్పుకునేందుకు కూడా వీలు లేకుండా యూనియన్లను రద్దుచేసి నియంత పాలన కొనసాగించారని దుయ్యబట్టారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే RTC కోట్ల రూపాయల లాభాలను గడుస్తోందని ఆయన అన్నారు. RTC లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని నిరుపేద కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వనపర్తి డిపో నుంచి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులేసేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని ఈ క్రమంలోనే ఆర్టీసీలో కొత్తగా కొనుగోలు చేసే బస్సులను మహిళా సంఘాల భాగస్వామ్యంతో కొనుగోలు చేస్తుందని ఆయన వివరించారు. అదేవిధంగా ఆర్టీసీలో వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేసి సేవలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి సమస్యలు లేకుండా కడుపులో పెట్టి చూసుకునేందుకు నియోజకవర్గంలో నేనున్నానని ఎలాంటి సమస్యలను తన దృష్టికి తీసుకురావాల్సిందిగా ఎమ్మెల్యే కార్మికులకు సూచించారు. కార్యక్రమంలో వనపర్తి పట్టణ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు జయసుధ మధుగౌడ్, చీర్ల సత్యం సాగర్, విభూది నారాయణ, డిపో మేనేజర్ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : లాభాల బాటలో ఆర్టీసీ)