డ్రాఫ్ బాక్సులు ఏర్పాటు
న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ , ఐపీఎస్ ఆదేశాల మేరకుమాదకద్రవ్యాల వినియోగం, రవాణా వంటి వలన జరిగే నష్టపరిహారం, నమోదు చేయబడే కేసులు, వాటి శిక్షలు తదితర అంశాల గురించి వివరిస్తూ సంకల్పం పోస్టర్స్ ను, గంజాయి వాడకం, రవాణా వివరాలు తెలియ పరచడానికి డ్రాప్ బాక్స్ లను ఆర్టీసీ కాంప్లెక్స్ , రైల్వే స్టేషను, మహారాజా ఆసుపత్రి తదితర ప్రాంతాలలో శుక్రవారం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఈ డ్రాప్ బాక్స్ లను వారానికి ఒకసారి చెక్ చేసి అందులో ఇచ్చిన వివరాలను గోప్యత గా ఉంచుతామన్నారు. గంజాయి అక్రమ రవాణా గురించి పూర్తిస్థాయి వివరాలను సేకరించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.అంతేకాక ఈ డ్రాప్ బాక్స్ లను ముఖ్యమైన కూడళ్ళు వద్ద, కాలేజీల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సై నరేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : డ్రాఫ్ బాక్సులు ఏర్పాటు)