పట్టణ నిరాశ్రయులకు అల్పాహారం వితరణ
న్యూస్‌తెలుగు/విజయనగరం : విశాలాంధ్ర సీనియర్ జర్నలిస్ట్ మరుపల్లి ప్రతాప్ కుమార్తె మరుపల్లి హాసిని పుట్టినరోజు సందర్బంగా శుక్రవారం ఉదయం ఫైర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తిస్తున్న పట్టణ నిరాశ్రయుల భవనంలో ఉన్న వృద్దులకు అల్పాహార పొట్లాలు, పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుట్టినరోజు, పెళ్లిరోజు తదితర వేడుకలలో నిరాశ్రయులను ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు బాలు తదితరులు పాల్గొన్నారు. (Story : పట్టణ నిరాశ్రయులకు అల్పాహారం వితరణ )