పాడి పరిశ్రమను ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది
ఎంపీడీవో సాయి మనోహర్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పాడి పరిశ్రమను ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తుందని ఎంపీడీవో సాయి మనోహర్, మాజీ జడ్పీ చైర్మన్ చిగిచెర్ల ఓబిరెడ్డి, ఏపీవో అనిల్ కుమార్ రెడ్డి, పశువైద్యాయశాఖ అధికారి శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని చిగిచెర్ల గ్రామంలో మినీ గోకులానికి భూమి పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిగిచెర్ల గ్రామంలో లబ్ధిదారుడు నారాయణస్వామికి ప్రభుత్వం 1.85 లక్షలతో, ఉపాధి హామీ నిధులతో మంజూరు చేసిన మినీ గోకులం అని తెలిపారు. తొలుత భూమి పూజ నిర్వహించి, కార్యక్రమము యొక్క ప్రాధాన్యతను వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. అందుకే పాడి పశువుల సంరక్షణ కోసం మినీ గో కులాలు తీసుకువచ్చి సబ్సిడీతో ఉపాధి హామీ నిధులతో మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. వీటిని పాడి రైతులు ఉపయోగించుకొని, సద్వినియోగం చేసుకొని పాడి పశువులతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమములో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు, పశుసంవర్ధక సహాయకులు, సచివాలయం కార్యదర్శి రెడ్డమ్మ ,సిబ్బంది ,టీడీపీ నాయకులు పార్థరెడ్డి ,అజయ్ రెడ్డి, రాఘవరెడ్డి ,శేఖర్ రెడ్డి, చంద్రాయుడు ,అశోక్, కార్యకర్తలతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు. (Story : పాడి పరిశ్రమను ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది)