బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు
న్యూస్‌తెలుగు/వినుకొండ : ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ నందు గత నెల 15వ తారీకు నుండి ఇప్పటివరకు వైన్ షాప్స్ కు పర్మినెంట్ లైసెన్స్ లు ఇవ్వలేదు. అదే క్రమంలో ప్రొవిజనల్ లైసెన్స్ లు మరియు పర్మినెంట్ లైసెన్స్ లు ఇచ్చే క్రమం లో నిమగ్నమయ్యము. దుకాణాలు సర్దుబాటు ఇంకా అవలేదు. అయినా ఈ 15 రోజులలో నూజెండ్ల మండలం లోని రవ్వారం, కంబంపాడు మరియు వినుకొండ టౌన్ లో మొత్తం 3 బెల్ట్ షాపుల పై కేసులు నమోదు చేయడం జరిగింది. ఎక్కడైనా బెల్ట్ షాప్స్ నిర్వహిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొనబడును. పదే పదే బెల్ట్ షాప్స్ నిర్వహించే వారిపై పి.డి యాక్ట్ అమలు చేయబడునని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవర శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపేరు. (Story :బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు)