కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవం
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని రాజనీతిశాస్త్ర విభాగ అధిపతి డా. బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ , డా.కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన విద్యార్థులు, అధ్యాపకుల నడుమ ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా,,కె. ప్రభాకర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..నానాజాతి సమితి తర్వాత ఏర్పాటు చేసిన ఐ.రా. స. ప్రతి ఏడాది 1945 నుండీ అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగ ఘనంగా నిర్వహించు కోవడం జరుగుతోందని, ప్రపంచం మారే కొద్ది మన ప్రవర్తలలో మార్పు రావాలని, అందరు శాంతి, సామరస్యంగా ఐక్యతగా మెలగాలని యుఎన్ఓ స్థాపించిన తర్వాత నుండి ప్రపంచ దేశాలు చాల దగ్గరయ్యాయని, అలాగే స్వార్థంకూడా ఇవాళ పెరుగుతుందని, దాని ద్వార యుద్ధాలు జరుగుతున్నాయని తెలిపారు. వాటివల్ల భౌతికoగా మానసికంగాను, చాల నష్టం వాటిల్లుతుందని, శాంతి సామరస్యంతో మెలిగితే తప్ప మనిషి మనుగడ కష్టంగా ఉంటుందనీ తెలిపారు. ప్రస్తుతం 193 దేశాలు సభ్యత్వం కల్గి ఉన్నాయని, “యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గట్టెరస్ యువతను ఉద్దెసించి మీరు ప్రపంచాన్ని మంచి వైపు వ్యవస్థను మార్చగలగే శక్తి మీకు మాత్రమే ఉండని, ప్రతి ఒక్కరు నిరాశచెందక ముందుండి మార్పుకు కృషిచేయాలని కోరారని తెలిపారు. ఈ సంవత్సరం, చర్చ యొక్క థీమ్ “ఎవరినీ వదిలిపెట్టవద్దు: అభివృద్ధి కోసం కలిసి పనిచేయడం శాంతి, స్థిరమైన అభివృద్ధి, మానవ అభివృద్ధి కలదన్నారు. ఈ కార్యక్రమంలో డా. త్రివేణి, డా,, ఎస్. చిట్టెమ్మ, డా॥ ఎస్. షమీవుల్లా, ఎ. కిరణ్ కుమార్, ఎస్. పావని, హైమవతి, యం. పుష్పావతి,, సరస్వతి, బి. ఆనంద్, మీనా, .. తదితర అధ్యాపక, అధ్యాపకేతర బృందం విద్యార్థులు పాల్గొన్నారు.(Story : కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవం)